हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Terror Attack : పాకిస్థాన్ తో అన్ని సంబంధాలు కట్ – భారత్ సంచలన నిర్ణయాలు

Sudheer
Terror Attack : పాకిస్థాన్ తో అన్ని సంబంధాలు కట్ – భారత్ సంచలన నిర్ణయాలు

జమ్ముకశ్మీర్‌లోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ అత్యంత కఠినమైన నిర్ణయాలను తీసుకుంది. ఈ దాడిలో 28 మంది పర్యాటకులు ప్రాణాలు కోల్పోవడం, మరికొంతమంది తీవ్రంగా గాయపడడం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఉగ్రదాడికి పాల్పడిన వారికి పాక్ సంబంధాలు ఉన్నాయన్న అనుమానాల నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన కేబినెట్ కమిటీ భేటీలో పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.

పాకిస్థాన్‌తో పూర్తిగా దౌత్య సంబంధాలు పూర్తిగా కట్

ఈ నిర్ణయాల ప్రకారం, భారత్ తన దౌత్య సంబంధాలను పాకిస్థాన్‌తో పూర్తిగా తెంచుకుంది. పాక్‌కు చెందిన పౌరులు, పర్యాటకులు రెండు రోజుల్లో తమ దేశానికి వెళ్లిపోవాలని విదేశాంగ శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇకపై పాకిస్థాన్ పౌరులకు భారత్‌లో ప్రవేశం పూర్తిగా నిషేధించబడింది. అంతేగాక, అటారీ చెక్‌పోస్టును తక్షణమే మూసివేయాలని నిర్ణయం తీసుకుంది. పాక్ హైకమిషనర్‌ను కూడా భారత్ విడిచిపోవాలని సూచించడం, రెండు దేశాల మధ్య ఉన్న ఇండస్ జల ఒప్పందాన్ని నిలిపివేయడమూ భారత దిగ్గజ నిర్ణయాల్లో భాగంగా నిలిచాయి.

పహల్గాం దాడి పిరికిపంద చర్య

ఈ చర్యలపై విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టతనిచ్చారు. పహల్గాం దాడి పిరికిపంద చర్యగా ప్రపంచ దేశాల తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. భారత్‌ ఈ దాడికి తగిన బదులు ఇచ్చే దిశగా ముందుకెళ్తోందని ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ప్రకటించారు. త్వరలోనే ఉగ్రవాదుల పైనా, వాటికి మద్దతిచ్చే దేశాలపైనా ప్రపంచాన్ని ఆశ్చర్యంలో ముంచే విధంగా భారత్ చర్యలు తీసుకుంటుందని ప్రకటించారు.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870