हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Sunitha : ప్రవస్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సునీత

Divya Vani M
Sunitha : ప్రవస్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సునీత

వర్ధమాన గాయని ప్రవస్తి చేసిన ఆరోపణలు ఇప్పుడు టీవీ ప్రపంచంలో హాట్ టాపిక్ అయ్యాయి. ఈ ఆరోపణలపై ప్రముఖ గాయని, రియాలిటీ షో జడ్జ్ సునీత తీవ్రంగా స్పందించారు. ప్రవస్తి చేసిన వ్యాఖ్యలను ఆమె బలంగా ఖండించారు.ప్రవస్తి ప్రతి అంశాన్ని వ్యక్తిగతంగా తీసుకోవడం సరికాదని సునీత అన్నారు. “ప్రేక్షకుల ముందే అన్నీ స్పష్టంగా చెప్పడం మంచిది,” అని సూటిగా వ్యాఖ్యానించారు.పాత రోజులను గుర్తు చేస్తూ సునీత చెప్పారు, “నీవు చిన్నగా ఉండగా ముద్దు పెట్టాను. ఇప్పుడు అదే చేష్టలు చేస్తే ఎలా ఉంటుంది?” అంటూ ప్రవస్తికి ప్రశ్న వేశారు.

Sunitha ప్రవస్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సునీత
Sunitha ప్రవస్తి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన సునీత

భావోద్వేగంతో పాడే గాయని పాత్ర

రియాలిటీ షోలలో పాల్గొంటున్నప్పుడు ఎవరైనా బాగా పాడితే, కోచ్‌లంతా భావోద్వేగానికి లోనవుతామన్నారు. “ఆ క్షణాల్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలి” అని చెప్పారు.

“నువ్వే చాలామంది పోటీల్లో పాల్గొన్నావు కదా?”

ప్రవస్తి అనవసర వ్యాఖ్యలు చేయడాన్ని సునీత తప్పుపట్టారు. “నువ్వే ఎన్నో షోలలో పాడావు కదా. ప్రక్రియ ఎలా ఉండేదో గుర్తు లేదు?” అంటూ ఘాటుగా ప్రశ్నించారు.సంగీత పోటీల్లో పాటలు ఎన్నుకోవడంలో టీవీ ఛానళ్లకు కొన్ని పరిమితులు ఉంటాయని సునీత స్పష్టంచేశారు. “అన్ని పాటలను ప్రసారం చేయడం సాధ్యం కాదు. కేవలం హక్కులు ఉన్న పాటలే పాడాల్సి ఉంటుంది” అని వివరించారు.చిన్న విషయాలు పెద్ద ఆరోపణలుగా మారకుండా ఉండాలంటే, నిజాల్ని చెప్పడం అవసరమని సూచించారు. “ప్రవస్తి ఈ విషయాలు బయటపెడితే, నేను నిజంగా సంతోషిస్తాను” అని చెప్పారు.

ప్రవస్తి మాటలు బాధించాయ్ – సునీత ఆవేదన


తన గురించి ప్రవస్తి ఈ స్థాయిలో మాట్లాడడం బాధ కలిగించిందని సునీత అన్నారు. “నన్ను వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం తగదు. ఈ విధంగా మాట్లాడడం నిరాశ కలిగించే విషయమే” అని ఆమె తేల్చి చెప్పారు.

Read Also : Nani: మూవీ నెగిటివ్ రివ్యూల పై స్పందించిన నాని

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870