हिन्दी | Epaper
EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ నేటి నుంచి దేశవ్యాప్తంగా కొత్త నిబంధనలు అమల్లోకి కాంగ్రెస్–బీజేపీ ఆరోపణల ఉదృతి ఆపరేషన్ సాగర్ బంధు పుతిన్ రెండు రోజుల భారత్ పర్యటన కేంద్ర మాజీ మంత్రి శ్రీప్రకాశ్ జైస్వాల్ కన్నుమూత

Supreme Court: రాష్ట్రపతికి మేము మళ్ళీ ఆదేశాలివ్వాలా: సుప్రీం కోర్టు

Sharanya
Supreme Court: రాష్ట్రపతికి మేము మళ్ళీ ఆదేశాలివ్వాలా: సుప్రీం కోర్టు

ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన కీలకమైన తీర్పు ముఖ్యంగా రాష్ట్రాల శాసన సభల్లో రెండు సార్లు ఆమోదించిన బిల్లులను గవర్నర్ లేదా రాష్ట్రపతి ఆలస్యం చేయకుండా నిర్ణయించాల్సిన అవసరం ఉన్నదనే అంశం దేశవ్యాప్తంగా రాజకీయ, న్యాయ, మరియు పౌర సవాళ్లను తేచ్చింది. ఈ పరిణామాల్లో వివిధ రాజ్యాంగ సంస్థల మధ్య అధికార పరిమితులు, సమతుల్యతపై చర్చ మళ్లీ చెలరేగింది. రాష్ట్రపతి, గవర్నర్‌కు సుప్రీం కోర్టు ఇటీవలే గడువు నిర్దేశించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే దీనిపై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్, బీజేపీ నేతలు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. న్యాయ వ్యవస్థ పాలనా వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటుందని ఆరోపించారు. అయితే తాజాగా వీటిపై కాబోయే సీజేఐ స్పందించారు.

సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యం

తమిళనాడులో శాసనసభ ఆమోదించిన పది బిల్లులను ఆ రాష్ట్ర గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదించకుండా అలాగే ఉంచారు. ఈ చర్య రాజ్యాంగ విరుద్ధమని, ప్రజాప్రతినిధుల ఆధీనంలో ఉండే శాసన వ్యవస్థ నిర్ణయాలను గవర్నర్ అడ్డుకోవడం ప్రాథమిక ప్రజాస్వామ్య ప్రమాణాలకు విరుద్ధమని తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులో ప్రధానాంశాలు:

రాష్ట్ర గవర్నర్‌కు బిల్లులను నిలిపివేసే అధికారం పరిమిత కాలానికి మాత్రమే ఉండాలని తెలిపింది. బిల్లును ఆమోదించాలన్నా తిరస్కరించాలన్నా గడువు మించకుండా నిర్ణయం తీసుకోవాలని స్పష్టం చేసింది. మంత్రుల మండలి సలహా మేరకు రాష్ట్రపతికి పంపితే గడువు ఒక నెల మాత్రమేనని పేర్కొంది. గవర్నర్ ఆలస్యాన్ని కోర్టులు సమీక్షించవచ్చని తెలిపింది. ఈ తీర్పుతో కార్యనిర్వాహక వ్యవస్థపై న్యాయ వ్యవస్థ జోక్యం పెరిగిందని భావిస్తున్న నేతలు ముఖ్యంగా బీజేపీ శ్రేణి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ వ్యాఖ్యలు

ఇలా సుప్రీం కోర్టు సంచలన తీర్పునివ్వగా ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్ స్పందించారు. రాష్ట్రపతికి గడువు నిర్దేశించేలా న్యాయవ్యవస్థ వ్యవహరించడం తగదని ప్రజాస్వామ్య శక్తులపై అణుక్షిపణిని సుప్రీం కోర్టు ప్రయోగించరాదని అన్నారు. శాసించే జడ్జులు ఉన్నారని, కార్యనిర్వాహక విధులూ వారే నిర్వర్తిస్తారంటూ కామెంట్లు చేశారు. మరోవైపు సుప్రీం కోర్టు చట్టాలు చేస్తే గనుక పార్లమెంట్ భవనాన్ని మూసివేయాలని ఎంపీ వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా వక్ఫ్ సవరణ చట్టం నేపథ్యంలో భాగంగా పశ్చిమ బెంగాల్‌లో ఇటీవల ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి అందరికీ తెలిసిందే. దాంతో ఆ రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరుతూ న్యాయవాది విష్ణు శంకర్ జైన్ అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.

జస్టిస్ బీఆర్ గవాయ్ కీలక వ్యాఖ్యలు

ఈక్రమంలోనే కాబోయే సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగానే జస్టిస్ గవాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం తాము కార్యనిర్వాహక వ్యవస్థలో జోక్యం చేసుకుంటున్నామనే ఆరోపణలు ఎదుర్కుంటున్నామని చెప్పారు. ఇలాంటి సమయంలో రాష్ట్రపతికి ఆదేశాలు ఇవ్వాలా అని ప్రశ్నించారు.

Read also: Judge: ఢిల్లీ కోర్టులోనే మహిళా జడ్జిని బెదిరించిన నిందితుడు

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

నెట్ అవసరం లేని చెల్లింపులు

నెట్ అవసరం లేని చెల్లింపులు

నెల జీతానికి పనిచేసే మహిళపై 13 కోట్ల జీఎస్టీ నోటీసులు

నెల జీతానికి పనిచేసే మహిళపై 13 కోట్ల జీఎస్టీ నోటీసులు

అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్

అత్యాచార బాధితుల కోసం కొత్త యాప్

కర్ణాటక కాంగ్రెస్లో ముగియని ‘కుర్చీ’ లొల్లి

కర్ణాటక కాంగ్రెస్లో ముగియని ‘కుర్చీ’ లొల్లి

రూ.24 కోసం ట్రై చేసి రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ..ఎలా అంటే !!

రూ.24 కోసం ట్రై చేసి రూ.87 వేలు పోగొట్టుకున్న మహిళ..ఎలా అంటే !!

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో

ప్రయాణికులకు రూ.610 కోట్లు రీఫండ్ చేసిన ఇండిగో

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

ఘోర రోడ్డు ఘటన: మహరాజ్‌గంజ్‌లో యువకుడు మృతి

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

మహిళలు–వృద్ధులకు లోయర్ బెర్త్ హామీ: ప్రయాణికులకు కొత్త సౌకర్యాలు

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

గోవా అగ్నిప్రమాదం.. పరిహారం ప్రకటించిన సీఎం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

డీకే శివకుమార్ ED వేధింపులపై తీవ్ర ఆగ్రహం

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ
1:14

పాక్‌లో  భర్త మోసం: ప్రధాని మోదీని ఆశ్రయించిన మహిళ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

గోవా అగ్నిప్రమాదం: స్పందించిన రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ

📢 For Advertisement Booking: 98481 12870