డబ్ల్యూడబ్ల్యూఈ ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ పొందిన మరియు అత్యంత విజయవంతమైన రెజ్లర్లలో ఒకరైన జాన్ సీనా, తాను పొందిన 17వ వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్‌తో కొత్త రికార్డు నెలకొల్పారు. ఇప్పటివరకు ఈ ఘనత నేచర్ బాయ్ రిక్ ఫ్లైర్ పేరిట ఉండేది.

2025లో అట్టహాసంగా నిర్వహించబడిన రెసిల్‌మేనియా 41 ఈవెంట్ లో జాన్ సీనా – కొడీ రోడ్స్ మధ్య జరిగిన ప్రధాన పోరాటం ఒక లెజెండరీ ఫైట్‌గా నిలిచింది. రెండు తరాల మధ్య జరిగిన ఈ ఢీకొనుడు అత్యంత ఉత్కంఠభరితంగా సాగింది. చివరికి సీనా తన అనుభవంతో, శారీరక నైపుణ్యంతో, అభిమానుల మద్దతుతో ఘన విజయం సాధించి 17వ టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. రిక్ ఫ్లైర్ 16 సార్లు వరల్డ్ ఛాంపియన్‌షిప్ టైటిల్ గెలిచి దశాబ్దాలుగా ఆ రికార్డు మీద ఆధిపత్యం చెలాయిస్తున్నారు. అయితే సీనా మాత్రం ఇప్పటికీ యాక్టివ్ రెజ్లర్‌గా ఉన్న సమయంలోనే ఆ రికార్డును అధిగమించి, కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాడు. ఇది కేవలం గణాంకాల విజయం కాదు – అభిమానుల గుండెల్లో ముద్ర వేసే స్థాయిలో గొప్ప ఘట్టం. ఈ రికార్డు సృష్టించడం ప్రత్యేకమే కాకుండా భావోద్వేగభరితమైనది కూడా. ఎందుకంటే, ఈ రెసిల్‌మేనియా 41 ఈవెంట్‌నే జాన్ సీనా తన చివరి ఫైట్‌గా ప్రకటించారు. ఇటీవలే తన రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటించిన సీనా, తన కెరీర్‌కు ఓ శోభాయమానమైన ముగింపు ఇచ్చారు
Read also: IPL 2025 : 20 ఓవర్లలో 6 వికెట్లకు 157 పరుగులు చేసిన పంజాబ్