हिन्दी | Epaper
తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్ తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే? నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ ఆధార్ కార్డు జెరాక్స్ కాఫీలపై త్వరలో కేంద్రం కీలక నిర్ణయం గోవాలో భయానక అగ్ని ప్రమాదం రెపో రేటును 0.25 శాతం తగ్గించిన ఆర్‌బీఐ EPFO: ఆధార్–UAN లింక్‌పై EPFO కఠిన నిర్ణయం బస్తర్‌ అడవుల్లో భారీ ఎన్‌కౌంటర్ గత ఐదేళ్లలో 2లక్షలకు పైగా కంపెనీలు క్లోజ్ కేరళ సీఎంకు ED నోటీసులు చలాన్లపై భారీ డిస్కౌంట్

120-year-old : వయసు 120…ఇప్పటికీ బతుకుబండి లాగిస్తున్నాడు!

Divya Vani M
120-year-old : వయసు 120…ఇప్పటికీ బతుకుబండి లాగిస్తున్నాడు!

వృద్ధాప్యం అనగానే చాలామంది విశ్రాంతిని కోరుకుంటారు.కానీ తమిళనాడులోని ఓ వృద్ధుడు మాత్రం అందుకు భిన్నంగా, నిజమైన జీవిత స్ఫూర్తిగా నిలుస్తున్నారు.ఆయన వయసు 120 ఏళ్లు.అయినా ఇంకా తన పాదాలపై నిలబడి కష్టపడుతూ జీవనం సాగిస్తున్నారు. ఇది నేడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.ఈ మహానుభావుడి పేరు మహ్మద్ అబు సలీమ్.వయస్సు నమ్మశక్యంగా లేకపోయినా, ఆయన జీవన విధానం చూసి యువత కూడా ఆశ్చర్యపడుతున్నారు.బర్మాలో పుట్టిన సలీమ్‌ గారు, కొన్ని దశాబ్దాల క్రితం తమిళనాడుకు వలస వచ్చారు.అక్కడే స్థిరపడ్డారు.అయితే జీవితంలో ఓ ఘోరమైన దుర్ఘటన ఆయనను వేదించింది. ఒకటి కాదు, రెండు కాదు—తన కుటుంబ సభ్యులందరినీ ఓ ప్రమాదంలో కోల్పోయారు.ఆ విషాదాన్ని తట్టుకుని, చేతిలో ఏం లేకపోయినా, ఒక ఆశతో ముందుకు సాగారు.తాను తెలిసిన శ్రమతోనే జీవించాలన్న సంకల్పంతో తీపి తినుబండారాల తయారీ చేపట్టారు. అలా మొదలైంది ఆయన లడ్డూ ప్రయాణం.

అల్లం, కొబ్బరి, గ్లూకోజ్‌తో ప్రత్యేకమైన రుచుల లడ్డూలు తయారు చేయడం ఆయన ప్రత్యేకత.50 ఏళ్లుగా అదే పనిలో ఉన్నారు.కడలూరు, విల్లుపురం, తిండివనం, మాయావరం, కుంభకోణం ఇలా ఎన్నో పట్టణాల్లో ఆయన లడ్డూలకు మంచి గుర్తింపు ఉంది.ఎక్కడికైనా వెళ్లి స్వయంగా అమ్మడం ఆయన అలవాటు. కానీ ఇప్పుడు వయస్సు అడ్డు కావడంతో ఇంటి వద్దే తయారీకి పరిమితం అయ్యారు. అయినా రుచి మర్చిపోలేని లడ్డూల కోసం ప్రజలు స్వయంగా ఆయన ఇంటి వద్దకు వస్తున్నారు.అందరి అబ్బురానికి కారణమైన విషయం ఏంటంటే – ఆయన రోజూ రెండు లేదా మూడు లడ్డూలు తింటారు. అయినా శరీరానికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేవు. ఇది ఆయన ఆరోగ్యానికి కూడా ఓ రహస్యం అయ్యింది.ఇటీవల మహ్మద్ షేక్ అనే యువకుడు సలీమ్‌ గారిని ఇంటర్వ్యూ చేశారు. ఆ వీడియోను సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఒక్కసారిగా ఆయన కథ వైరల్ అయిపోయింది. వందలాది మంది నెటిజన్లు ఈ వృద్ధుడిని ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. వయసు నిమిత్తం కాదు, మనసు యువకుడివైతే ఏ పని సాధ్యమేనని చాటిచెప్పారని అందరూ అంటున్నారు.ఇతరులు విశ్రాంతికి మొగ్గుచూపే వయసులో, సలీమ్ మాత్రం జీవనోపాధి కోసం కాకుండా, జీవితానికే ఓ ప్రేరణగా నిలిచారు. ఆయన పట్టుదల, శ్రమ, స్ఫూర్తి మనందరికీ ఒక గొప్ప బోధ. ఇది కేవలం ఓ వ్యక్తి జీవితం కాదుగాని, ఒక జీవన పాఠం. అలాంటి కథలు నేటి సమాజానికి నిజంగా అవసరం.

Read Also : Gaza: గాజాలో 51వేలకు చేరిన మృతుల సంఖ్య

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

ల్యాండింగ్ సమయంలో శిక్షణ విమానం ప్రమాదం
0:15

ల్యాండింగ్ సమయంలో శిక్షణ విమానం ప్రమాదం

గోవా క్లబ్ యజమానులకు ఇంటర్‌పోల్ ‘బ్లూ కార్నర్ నోటీస్’? అయ్యో

గోవా క్లబ్ యజమానులకు ఇంటర్‌పోల్ ‘బ్లూ కార్నర్ నోటీస్’? అయ్యో

అమెరికాలో 85 వేల వీసాలు రద్దు..షాక్ లో విద్యార్థులు

అమెరికాలో 85 వేల వీసాలు రద్దు..షాక్ లో విద్యార్థులు

సోనియా గాంధీ పుట్టినరోజు: రాజకీయాల్లో స్ఫూర్తి

సోనియా గాంధీ పుట్టినరోజు: రాజకీయాల్లో స్ఫూర్తి

విజయ్ సభ వద్దకు తుపాకీతో వచ్చిన వ్యక్తి..

విజయ్ సభ వద్దకు తుపాకీతో వచ్చిన వ్యక్తి..

కొత్త జంట ప్రాణం తీసిన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్

కొత్త జంట ప్రాణం తీసిన ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్

మరోసారి తెరపైకి సీఎం పదవికి  వివాదం..డీకే శివకుమార్ స్పందన

మరోసారి తెరపైకి సీఎం పదవికి  వివాదం..డీకే శివకుమార్ స్పందన

సోనియాగాంధీకి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

సోనియాగాంధీకి బర్త్ డే శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ

ఇండిగో రద్దులపై ప్రధాని మోదీ స్పందన

ఇండిగో రద్దులపై ప్రధాని మోదీ స్పందన

మరో రెండు రోజులు ఢిల్లీ కి ఇండిగో సేవలు ఉండవు

మరో రెండు రోజులు ఢిల్లీ కి ఇండిగో సేవలు ఉండవు

గోవా క్లబ్ అగ్నిప్రమాదం: ముందే ఫిర్యాదులు, అయినా చర్యలేవు?…

గోవా క్లబ్ అగ్నిప్రమాదం: ముందే ఫిర్యాదులు, అయినా చర్యలేవు?…

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే?

తెలంగాణలో కొత్త జూ పార్క్‌.. ఎక్కడంటే?

📢 For Advertisement Booking: 98481 12870