हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Anchor Rashmi : ర‌ష్మీకి స‌ర్జ‌రీ … ఎందుకంటే?

Divya Vani M
Anchor Rashmi : ర‌ష్మీకి స‌ర్జ‌రీ … ఎందుకంటే?

తెలంగాణ బ్యూటీ, పాపులర్ యాంకర్ రష్మీకి ఇటీవల అనుకోని ఆరోగ్య సమస్యలు ఎదురయ్యాయి.ఆ పరిస్థితుల నుంచి ఆమె ఎలా బయటపడిందో స్వయంగా ఓ ఎమోషనల్ పోస్ట్ ద్వారా వివరించింది.సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన ఆ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతోంది.తాజాగా జరిగిన శస్త్రచికిత్స గురించి ఆమె మనసులోని బాధను బయటపెట్టింది.ఇటీవలి రోజులు నాకు చాలా కఠినంగా గడిచాయి. చాలా తక్కువ సమయంలో నా ఆరోగ్యం క్షీణించిపోయింది.ఐదు రోజుల్లోనే హిమోగ్లోబిన్ లెవల్స్ 9కి పడిపోయాయి, అంటూ తన పోస్ట్ ప్రారంభించింది.జనవరి నుంచే సమస్యలు మొదలయ్యాయని, కానీ అసలైన గడ్డుకాలం మార్చిలో వచ్చిందని చెప్పింది.ఆమె తెలిపిన వివరాల ప్రకారం, తీవ్రమైన భుజం నొప్పితో పాటు, ఆకస్మిక రక్తస్రావం కూడా కలిగిందట. దీంతో ఏమైపోతుందో అర్థం కాక, డాక్టర్లను సంప్రదించిందని చెప్పింది.కానీ ఆ సమయంలో ఏ లక్షణాన్ని ముందు ట్రీట్ చేయాలో కూడా డాక్టర్లకే క్లారిటీ లేకపోయిందట. మార్చి 29కి పూర్తిగా నీరసించిపోయాను.

Anchor Rashmi ర‌ష్మీకి స‌ర్జ‌రీ ... ఎందుకంటే
Anchor Rashmi ర‌ష్మీకి స‌ర్జ‌రీ … ఎందుకంటే

అయితే నా వర్క్‌ క‌మిట్‌మెంట్‌ ఏదీ వదలకుండా పూర్తి చేశాను. అన్ని పనులు ముగించుకున్న తర్వాతే ఆసుపత్రిలో చేరాను, అని తెలిపింది రష్మీ. చివరకు ఏప్రిల్ 18న ఆమెకు శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం తాను క్షేమంగా ఉన్నానని పేర్కొంది.“ప్రస్తుతం ఆరోగ్యం బాగుంది. కానీ వైద్యుల సూచనల మేరకు మరో మూడు వారాల పాటు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలి. ఈ ప్రయాణంలో నన్ను నమ్మిన, అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, అంటూ తన కుటుంబ సభ్యులకు, డాక్టర్లకు కృతజ్ఞతలు తెలియజేసింది.ఈ పోస్ట్‌కు రష్మీ తన శస్త్రచికిత్సకు ముందు తీసుకున్న కొన్ని ఫోటోలు కూడా జత చేసింది. వాటిలో ఆమె ముఖంలో అలసట, నీరసం స్పష్టంగా కనిపిస్తోంది. అయినప్పటికీ, ఆమె చూపిన ధైర్యం, ఆత్మవిశ్వాసం ఎంతో మందికి ప్రేరణగా నిలుస్తోంది.ఆమె అభిమానులు రష్మీకి wishing a speedy recovery అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “నీ కామ్‌బ్యాక్ కోసం ఎదురు చూస్తున్నాం, స్ట్రాంగ్ గర్ల్, నువ్వే విజేత, అంటూ ఆమె పోస్ట్‌పై హార్ధిక స్పందనలు వ్యక్తం చేస్తున్నారు.రష్మీ గతంలో ఎన్నో షోలతో బుల్లితెరను ఊపేసిన యాంకర్‌. ఆమె ఎనర్జీ, హాస్యంతో ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇప్పుడు ఆమె ఆరోగ్యం బాగుందని తెలిసి ఫ్యాన్స్‌కు త్రుప్తి కలిగింది.

Read Also : ILayaraja: షష్టిపూర్తి మూవీ ప్రమోషన్స్‌ లో పాల్గొన్న ఇళయరాజా

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870