గురుగ్రామ్‌లోని ప్రముఖ మేదాంత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మహిళపై, అదే ఆసుపత్రిలో పనిచేస్తున్న టెక్నీషియన్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏప్రిల్ 6న జరిగితే, బాధితురాలు ఇటీవల డిశ్చార్జ్ అయిన తర్వాత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 46 ఏళ్ల మహిళ ఎయిర్ హోస్టెస్‌గా పనిచేస్తున్నారు. ఇటీవల అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు ఆమెను మేదాంత ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందించారు. ఈ సమయంలో ఆమెపై అత్యంత దారుణమైన లైంగికదాడి జరిగింది.
ఐసీయూలో లైంగికదాడి
ఏప్రిల్ 6న, ఆసుపత్రిలోని యువకుడు ఆమె బెడ్ వద్దకు వచ్చి లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఐసీయూలో చికిత్స పొందుతున్న బాధితురాలు శారీరకంగా బలహీనంగా ఉండటంతో అతన్ని అడ్డుకునే స్థితిలో లేకపోయింది. ఆ సమయంలో అక్కడే విధులు నిర్వహిస్తున్న ఇద్దరు నర్సులు ఉన్నప్పటికీ, ఎవ్వరూ దానిని అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ఆమె ఆరోపించింది. ఏప్రిల్ 13న బాధితురాలు ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. అప్పటివరకు ఆమె తన భర్తకు విషయం చెప్పలేకపోయారు. ఇంటికి వచ్చిన తర్వాత జరిగిన దారుణాన్ని పంచుకోగా, భర్త వెంటనే ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా ఏప్రిల్ 14న సదర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు.
పోలీసుల దర్యాప్తు
పోలీసులు ఈ కేసును సీరియస్‌గా తీసుకుని, ఎనిమిది మంది సభ్యులతో కూడిన ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. సిట్ బృందం ఆసుపత్రిలోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తూ, స్టాఫ్‌ను విచారించింది. దాదాపు 800కి పైగా సీసీటీవీ క్లిప్‌లను చూసిన తర్వాత నిందితుడిని గుర్తించారు. పోలీసులు నిందితుడిని బీహార్ రాష్ట్రం ముజఫర్‌పూర్ జిల్లాకు చెందిన దీపక్‌గా గుర్తించారు. అతను గత ఐదు నెలలుగా మేదాంత ఆసుపత్రిలో టెక్నీషియన్‌గా పనిచేస్తున్నాడు. పోలీసులు అతన్ని అరెస్ట్ చేసి, మరిన్ని వివరాలు రాబడుతున్నారు. ఆసుపత్రిలో పని చేస్తున్నవారిలో కలిగిన నైతిక బాధ్యతలపై కూడా దర్యాప్తు జరుగుతోంది. ఆసుపత్రుల్లో భద్రతా చర్యలు, నర్సింగ్ సిబ్బంది బాధ్యతలపై గట్టిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
Read also: Madhya Pradesh: ప్రియుడి స్నేహితులతో కలిసి భర్తను హత్య చేసిన భార్య