సూర్య, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘రెట్రో’. ఈ సినిమాకు కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, పోస్టర్స్, గ్లింప్స్‌లకు మంచి స్పందన వచ్చిన నేపథ్యంలో తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం సాయంత్రం మేకర్స్ విడుదల చేశారు. ట్రైలర్ చూసినవారు సోషల్ మీడియాలో పాజిటివ్ రెస్పాన్స్ ఇస్తున్నారు.
సూర్య మాస్ అవతారం
ట్రైలర్‌లో సూర్య మాస్ అవతారంలో కనిపించడమే కాకుండా, ఆయన గెటప్ కూడా ఎంతో డిఫరెంట్‌గా ఉంది. ఇది ఓ గ్యాంగ్‌స్టర్ లవ్ స్టోరీగా రూపొందిన సినిమా అని స్పష్టమవుతోంది. ట్రైలర్ చివర్లో వినిపించే “నిజమైన యుద్ధం వస్తోందని ఎదురుచూస్తున్నాం”, “ముద్దుల కొడుకా.. డాడీ ఈజ్ కమింగ్ రా” వంటి పవర్‌ఫుల్ డైలాగ్స్ ప్రేక్షకులను ఫిదా చేస్తుంటే, సంతోష్ నారాయణన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఈ టీజర్‌కు మరింత ఊపిరి అందించింది.

కీలక పాత్రల్లో సీనియర్ నటులు
ఈ చిత్రంలో జయరామ్, ప్రకాశ్ రాజ్, నాజర్, జోజూ జార్జ్ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్ మరియు స్టోన్ బీచ్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తుండగా, జ్యోతిక, సూర్య, కార్తికేయన్, కల్యాణ్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.