Rain Alert : తెలంగాణలో ఈరోజు వర్షం పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం గురువారం వెల్లడించింది. మహబూబ్నగర్, కామారెడ్డి, మెదక్, నాగర్ కర్నూల్, నారాయణపేట, నిజామాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ సందర్భంగా వాతావరణ కేంద్రం పలు సూచనలు చేసింది.

ఉరుములతో కూడిన వర్షం
ఆయా జిల్లాల్లో తేలిక పాటి నుంచి ఓ మోస్తర్ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. ఈ ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షం పడుతోంది.. ఆ సమయంలో పిడుగులు సైతం పడతాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు వాతావరణ కేంద్రం సూచించింది. ఇక ఈదురుగాలులు సైతం 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముందంది.
భద్రాచలం లో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు
గురువారం జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగాం, నాగర్ కర్నూల్ జిల్లాలలో అక్కడక్కడ మోస్తారు వర్షాలు కురిసాయి. ఈ రోజు గరిష్టంగా మెదక్ లో 41.9, కనిష్టంగా భద్రాచలం లో 35.6 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలోనూ ఓ వైపు వర్షాలు కురుస్తుంటే మరోవైపు పలు ప్రాంతాల్లో ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ క్రమంలో గురువారం నాడు నిజామాబాద్, మెదక్, ఆదిలాబాద్, రామగుండం, మహబూబ్ నగర్ , ఖమ్మం, భద్రాచలంలలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Read Also: 15 మందితో జ్యూరీ నియామకం