పాటల కోసం శ్రమించే డ్యాన్స్ మాస్టర్ అంటేనే ఒక ముద్ర అలాంటి గుర్తింపు తెచ్చుకున్న శివశంకర్ మాస్టర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన ఎన్నో భాషల్లో వందల పాటలకు నృత్య దర్శకత్వం అందించి, ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు. 2021లో ఆయన కన్నుమూశారు. ఆయన జీవితంలోని కొన్ని అనూహ్యమైన కోణాల్ని ఇప్పుడు ఆయన కుమారుడు విజయ్ శివశంకర్ వెల్లడించారు.విజయ్ మాట్లాడుతూ, “మా తాతయ్య రాజమండ్రికి చెందినవారు. అక్కడ మా కుటుంబం అరటిపండ్ల వ్యాపారం చేసేది. తోటలపై మా తాతయ్యకి ఎంతో ప్రేమ. ఆయన ఎక్కువ సమయం తోటల్లోనే గడిపేవారు, అని చెప్పారు.‘ఒక సమయంలో ప్రభుత్వం వ్యవసాయ భూముల పరిమితిపై కొత్త నిబంధన తీసుకొచ్చింది. దాంతో మా తాతయ్య తన పరిచయస్తుల పేర్లపై కొంత భూమిని రాశారు. కానీ తర్వాత వాళ్లు ఆ భూమిని తిరిగి ఇవ్వలేదు. ఇలా మోసపోయి దాదాపు 70 నుంచి 80 ఎకరాల భూమిని కోల్పోయారు,’అని వివరించారు.

మద్రాస్ బిజినెస్ వల్ల బాధ తక్కువే
‘అప్పట్లో మద్రాస్‌లో మా కుటుంబ వ్యాపారం బాగా నడుస్తుండటం వల్ల భూముల కోల్పోయిన బాధ పెద్దగా ప్రభావం చూపలేదు,’అని విజయ్ పేర్కొన్నారు.‘నాన్నగారు చిన్నప్పుడు ఓ ప్రమాదానికి గురయ్యారు. దాంతో వెన్నెముక దెబ్బతింది. ఎన్నో సంవత్సరాల పాటు మంచానికే పరిమితమయ్యారు. పదకొండో, పన్నెండో ఏళ్ల దాకా నడవలేకపోయారు,’అని ఆయన చెప్పారు.
అలా ప్రారంభమైంది డాన్స్ ప్రయాణం
‘‘నాన్నగారు చిన్నప్పట్నుంచే థియేటర్‌కి ఎక్కువ ఆసక్తిని చూపేవారు. స్టేజ్ షోలు చూసేంత వరకూ ఆయనలోని డ్యాన్స్ పట్ల ఆసక్తి బాగా పెరిగిపోయింది. అక్కడినుంచే ఆయన జీవితం కొత్త దారిలోకి వెళ్లింది. ఆ ఆసక్తే ఆయనను కొరియోగ్రాఫర్‌గా ఎదిగేలా చేసింది,’అని విజయ్ చెప్పారు.పోరాడి విజయం సాధించినవారిని మనం ఎందుకు మర్చిపోవాలి? చిన్ననాటి గాయాలతో కదలలేని స్థితిలో ఉన్న శివశంకర్ మాస్టర్, తనదైన కృషితో కోట్ల మందికి నృత్యంతో ప్రేరణగా నిలిచారు. ఆయన్నే ఆదర్శంగా తీసుకుని ఎంతోమంది డాన్సర్స్ ప్రస్థానం మొదలు పెట్టారు.
Read Also : OTT Movie: ఓటీటీలోకి ‘శివంగి’ క్రైమ్ థ్రిల్లర్! ఎప్పుడంటే?