తలైవా మళ్లీ ఎంట్రీ ఇచ్చిన జైలర్ సీక్వెల్
తలైవా రజనీకాంత్ పేరు మళ్లీ బాక్సాఫీస్‌ను షేక్ చేసిన సినిమా జైలర్. చాలా కాలంగా సరైన హిట్ కోసం ఎదురుచూస్తున్న రజనీ అభిమానులకు ఈ సినిమా మంచి ఊపును తీసుకొచ్చింది. ‘ఏ సినిమాకు రజనీ బ్రాండ్ ఉంటే, అది ఎంత బలంగా నిలబడుతుందో’ అని జైలర్ రిజల్ట్ నిరూపించింది. అందుకే ఇప్పుడు జైలర్ పార్ట్ 2పై అంచనాలు తారాస్థాయిలో ఉన్నాయి. సినిమా టీజర్‌తోనే మేకర్స్ ఈసారి గ్రాండ్ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని హింట్ ఇచ్చేశారు. రజనీ పాత్ర అయిన ముత్తువేల్ పాండియన్ మరోసారి తిరిగి రాబోతున్నాడంటే సినిమా ఇంకెంత పవర్‌ఫుల్‌గా ఉండబోతోందో ఊహించచ్చు.
పార్ట్ 2లో ఎవరెవరు కనిపిస్తారు..? క్లారిటీ ఇచ్చిన రమ్యకృష్ణ
జైలర్ సీక్వెల్‌పై అభిమానుల్లో ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. ముఖ్యంగా – పార్ట్ 1లో ఉన్న క్యారెక్టర్లు కొనసాగుతాయా..? లేక రజనీ క్యారెక్టర్ మాత్రమే తీసుకొని కొత్త కథతో వస్తారా..? అన్నది హాట్ టాపిక్‌గా మారింది. కానీ తాజాగా సీనియర్ నటి రమ్యకృష్ణ తాను మళ్లీ ముత్తువేల్ భార్య పాత్రలో కనిపించబోతున్నానని కన్ఫర్మ్ చేయడం ఈ డౌట్స్‌కు తెరదించింది. మరింత ఆసక్తికరంగా… నరసింహ సినిమా రిలీజ్‌కి నిండు 26 ఏళ్లు పూర్తైన రోజే, జైలర్ 2 షూటింగ్లో అడుగుపెట్టినందుకు గర్వంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ఇది అభిమానుల కోసం ఓ మేజర్ సర్ప్రైజ్.
మళ్లీ వస్తోంది ముత్తువేల్ పాండియన్ ఫ్యామిలీ
రమ్యకృష్ణతో పాటు మొదటి భాగంలో రజనీ కోడలిగా కనిపించిన మిర్న మీనన్ కూడా ఈ సీక్వెల్లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు. అంతేకాదు, మొదటి పార్ట్‌లో ఉన్న కొన్ని ఇతర కీలక పాత్రలు కూడా కొనసాగుతాయన్న సమాచారం వెలుగులోకి వచ్చింది. దీంతో దర్శకుడు నెల్సన్ అసలు కథను ఎక్కడ ముగించారో, అదే పాయింట్ నుంచి కొనసాగించాలని డిసైడ్ అయినట్టు స్పష్టమవుతోంది. ఇలా ఉండటంతో జైలర్ పార్ట్ 2, ప్రేక్షకుల ముందుకు ఒక పరిపూర్ణ కథగా రాబోతుందనే నమ్మకం పెరుగుతోంది.
మ్యూజిక్ మాజిక్ రిపీట్ కానుందా?
జైలర్‌కు మ్యూజిక్ ఇవ్వడంతో అనిరుద్ రవిచందర్ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ హైప్‌ను కొనసాగించేందుకు పార్ట్ 2కి కూడా అనిరుద్‌నే మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగించేందుకు టీమ్ ఫిక్స్ అయింది. సినిమా ఎనౌన్స్మెంట్ టీజర్లో తలైవాతో పాటు అనిరుద్, దర్శకుడు నెల్సన్ కూడా కనిపించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. దీంతో సంగీత పరంగా మరోసారి ఓ హై ఎనర్జీ ఆల్బమ్ రావడం ఖాయంగా కనిపిస్తోంది.
అభిమానుల అంచనాలు ఎక్కడికైనా..
ఇప్పటికే ‘జైలర్’ సినిమాతో రజనీ మరోసారి తన స్టార్‌డమ్‌ని ప్రూవ్ చేశాడు. సీక్వెల్‌ని కూడా అంతే స్థాయిలో మేక్ చేయాలని టీమ్ ప్రతిజ్ఞ తీసుకున్నట్టే కన్పిస్తోంది. మొదటి భాగం చివర్లో ఉన్న ఎమోషన్, యాక్షన్ మిక్స్‌కి కొనసాగింపుగా ఈ పార్ట్ 2లో మరింత హై ఇంటెన్సిటీ సన్నివేశాలు ఉండబోతున్నాయని టాక్. ముఖ్యంగా రజనీ పాత్రకు మరింత బలాన్ని ఇచ్చేలా స్క్రిప్ట్ డిజైన్ చేస్తున్నారని సమాచారం. దీంతో జైలర్ 2 కూడా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందనే అంచనాలు మామూలుగా లేవు.
READ ALSO: Horror movie: వణుకు పుటిస్తున హారర్ సినిమా