Minister Sridhar Babu : హైదరాబాద్‌లో అమెరికాకు చెందిన సిటిజన్స్ ఫైనాన్షియల్ గ్రూప్, కాగ్నిజెంట్ టెక్నాలజీస్ ఆధ్వర్యంలో సిటిజన్స్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సెంటర్‌ను మంత్రి శ్రీధర్‌బాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్రీధర్‌బాబు మాట్లాడారు. గ్లోబల్ బిజినెస్ హబ్‌గా హైదరాబాద్ మారిందని మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు. ఇక్కడ కమర్షియల్ స్పేస్‌కు డిమాండ్ బాగా పెరిగిందని చెప్పారు. ఢిల్లీ, చెన్నైలాంటి మెట్రో నగరాలతో పోలిస్తే హైదరాబాద్‌లో 56 శాతం వృద్ధి రేటు ఉందన్నారు.

అంతర్జాతీయ సంస్థలు నగరానికి
గతేడాది రిటైల్ రంగంలో 1.8 మిలియన్ చదరపు అడుగుల స్పేస్‌ను సంస్థలు లీజుకు తీసుకున్నాయి. ఆమ్జెన్, గ్లోబల్ లాజిక్, ఎలీ లిల్లీ, మారియట్, సిగ్నాలాంటి అంతర్జాతీయ సంస్థలు నగరానికి వచ్చాయి. ఏడాది వ్యవధిలో 70కి పైగా గ్లోబల్ కేపబులిటీ సెంటర్‌లు ఏర్పాటయ్యాయి. 2030 నాటికి దేశ జీడీపీలో తెలంగాణ వాటా ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం. అభివృద్ధిని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయి. ప్రభుత్వంపై నమ్మకంతో పారిశ్రామికవేత్తలు ముందుకు వస్తున్నారు అని శ్రీధర్‌బాబు అన్నారు.
Read Also: గిగ్ వర్కర్ల ఉద్యోగ భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ఫోకస్