हिन्दी | Epaper
HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు HDFC బ్యాంక్‌కు RBI భారీ జరిమానా వడ్డీ రేట్లు తగ్గే అవకాశం 7వ తేదీ లోపు ఉద్యోగులకు జీతాలు యూపీఐ చెల్లింపుల్లో ఫోన్ పే టాప్ కాగ్నిజెంట్‌లో ఉద్యోగులపై నిఘా! బీఎస్‌ఎన్‌ఎల్‌ తో జియో ఒప్పందం? మేం టూవీలర్లు తయారుచేయడం లేదు: టాటా భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలు ఆంధ్రా రొయ్యలకు ఆస్ట్రేలియా గ్రీన్ సిగ్నల్‌ వెండి విభాగం లాభాలు

UPI: దేశ వ్యాప్తంగా మరోసారి యూపీఐ సేవ‌ల్లో అంతరాయం

Sharanya
UPI: దేశ వ్యాప్తంగా మరోసారి యూపీఐ సేవ‌ల్లో అంతరాయం

ప్రధాన డిజిటల్ చెల్లింపు పద్ధతిగా ఉపయోగించే యూపీఐ పేమెంట్స్‌లో ఈ రోజు మరోసారి అంత‌రాయం ఏర్పడింది. దేశవ్యాప్తంగా అనేక వినియోగదారులు ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా తమ లావాదేవీలు చేయలేకపోయారు. ఈ సేవలు నిలిచిపోయిన విషయం వినియోగదారుల నుండి సామాజిక మాధ్యమాలలో తీవ్ర అసంతృప్తి వ్య‌క్తం అవుతోంది.

వినియోగదారుల అభ్యంతరాలు
యూపీఐ సేవ‌ల ప‌ని చేయ‌డం లేదని, నెట్‌వ‌ర్క్ స్లోగా ఉందని పలువురు వినియోగదారులు సోష‌ల్ మీడియా వేదిక‌లపై ఫిర్యాదు చేశారు. కొందరు వినియోగదారులు తమ యాప్స్ ద్వారా పేమెంట్స్ చేస్తూ, “సర్వీస్ అన్‌అవైలబుల్” అని చెప్పే మెసేజెస్ చూసారు. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం వంటి యాప్‌ల ద్వారా డిజిటల్ లావాదేవీలలో ఆటంకం ఏర్పడటంతో, వినియోగదారులు తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. సమాచార ప్రకారం, మధ్యాహ్నం 12 గంటల సమయానికి దాదాపు 1,000 మందికి పైగా వినియోగదారులు యూపీఐ సేవలలో అంత‌రాయం గురించి ఫిర్యాదు చేసినట్లు డౌన్ డిటెక్ట‌ర్ వెబ్‌సైట్ వెల్లడించింది. ఇది దేశవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్స్ వ్యవస్థకు తీవ్రమైన సమస్యను సృష్టిస్తోంది.

గత నెల 26న కూడా యూపీఐ సేవలు నిలిచిపోయాయి. సాంకేతిక కారణాలు వల్ల ఈ అసౌకర్యం తలెత్తిందని ఎన్‌పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) అప్పట్లో వివరణ ఇచ్చింది. అదే విధంగా, ఈ నెల 2న కూడా యూపీఐ సేవలు కొంతకాలం పనిచేయకపోవడంతో వినియోగదారులు ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. రోజుల వ్య‌వ‌ధిలో తాజాగా మ‌రోసారి యూపీఐ చెల్లింపుల వ్య‌వ‌స్థ‌లో ఆటంకం ఏర్ప‌డింది. దీనిపై ఎన్‌పీసీఐ ఇంకా స్పందించ‌లేదు.     

Read also: Donald Trump : టారిఫ్ లకు 90 రోజుల పాటు బ్రేక్ ప్రకటించిన ట్రంప్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870