సింగపూర్‌లో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదం అందరినీ కలిచివేసింది. ఈ ఘటనలో జనసేన అధినేత, ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ కూడా పాల్గొన్న స్కూల్‌లో మంటలు చెలరేగాయి. భవనంలో ఆ సమయంలో 22 మంది విద్యార్థులు ఉండగా, రెస్క్యూ సిబ్బంది ప్రాణాలను పణంగా పెట్టి వారిని రక్షించారు. వీరి సాహసం, చాకచక్యతను గుర్తించిన సింగపూర్ ప్రభుత్వం వారిని సత్కరించింది.
రెస్క్యూ టీమ్ విద్యార్థులను సురక్షితంగా రక్షించారు
సమయస్పూర్తితో స్పందించిన రెస్క్యూ టీమ్ విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకురావడంలో కీలకపాత్ర పోషించింది. మంటలతో అలముకున్న భవనంలోకి ప్రవేశించి ఒకొక్కరిని బయటకు తీసుకువచ్చిన సిబ్బంది చర్యలు ప్రశంసనీయమని ప్రభుత్వం పేర్కొంది. అందుకే వారి సేవలకు గుర్తింపుగా ప్రభుత్వ ప్రమాణపత్రాలు, పురస్కారాలు అందజేసినట్లు అధికారికంగా ప్రకటించారు.

కోలుకుంటున్న మార్క్ శంకర్
ఇక ప్రమాదంలో గాయపడిన మార్క్ శంకర్ ప్రస్తుతం పూర్తిగా కోలుకుని ఇంటికి చేరుకున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ప్రకటించారు. మృత్యువు అంచునుంచి కాపాడిన ఈ సిబ్బందికి తెలుగు ప్రజలు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ఈ ఘటనలో ప్రదర్శించిన ధైర్యం, సేవా దృక్పథం ఎంతో మందికి ప్రేరణగా నిలిచింది.