हिन्दी | Epaper

Amit Shah:అన్నాడీఎంకే పొత్తు ప్రకటించిన అమిత్ షా

Divya Vani M
Amit Shah:అన్నాడీఎంకే పొత్తు ప్రకటించిన అమిత్ షా

ఇప్పుడు తమిళనాడులో రాజకీయాలు కొత్త మలుపు తిరిగాయి అన్నాడీఎంకే – బీజేపీ కూటమి మరోసారి అధికారికంగా కుదిరింది వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలసి పోటీకి దిగనున్నాయి.చెన్నైలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ విషయం ప్రకటించారు పళనిస్వామి నాయకత్వంలోనే అన్నాడీఎంకే ముందుకు సాగుతుందని ఆయన స్పష్టంగా తెలిపారు.అమిత్ షా ఈ ప్రకటన చేయడానికి ముందుగా, అన్నాడీఎంకే చీఫ్ పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా 1998లో జయలలిత నేతృత్వంలో బీజేపీ–అన్నాడీఎంకే కూటమి సాధించిన విజయం గుర్తు చేశారు.అప్పట్లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఈ కూటమి మంచి ఫలితాలు సాధించింది.ఈసారి కూటమి కోసం అన్నాడీఎంకే ఎలాంటి షరతులు పెట్టలేదని అమిత్ షా స్పష్టం చేశారు.అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకోదని ఆయన చెప్పారు.ఇది రెండు పార్టీలకు రాజకీయంగా, ప్రజాదరణపరంగా ఎంతో ఉపయోగపడే కూటమి అవుతుందని అభిప్రాయపడ్డారు.

Amit Shah అన్నాడీఎంకే పొత్తు ప్రకటించిన అమిత్ షా
Amit Shah అన్నాడీఎంకే పొత్తు ప్రకటించిన అమిత్ షా

సీట్ల కేటాయింపు అంశం త్వరలో తేలుస్తామని కూడా తెలిపారు.ఇక రాష్ట్ర పాలనపై షా తీవ్ర వ్యాఖ్యలు చేశారు.స్టాలిన్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ధ్వజమెత్తారు. పౌరుల సమస్యలు పట్టించుకోకుండా, ప్రజల దృష్టిని మరల్చేందుకు సనాతన ధర్మం, త్రిభాషా విధానం లాంటి విషయాలను ముందుకు తెస్తోందని ఆరోపించారు.ఇక బీజేపీ – అన్నాడీఎంకే పొత్తు అంటే తమిళనాడులో రాజకీయ సమీకరణలు బాగా మారతాయి. గత ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసి పెద్దగా ఆశించిన ఫలితాలు రాకపోయిన బీజేపీకి ఇది ఒక శుభసూచకం. అలాగే సింగిల్ గా పోటీచేస్తే ఓటు విడిపోతుందనే భయంతో ఉన్న అన్నాడీఎంకేకు ఇది ఓ ఊరట.ఇకపై ఈ రెండు పార్టీల కూటమి ప్రచారాన్ని ముమ్మరం చేయనుంది. అభ్యర్థుల ఎంపిక, సీట్ల సర్దుబాటు వంటి విషయాల్లో మరోసారి చర్చలు జరుగుతాయి. అయితే ఇప్పుడే కూటమి ప్రకటించడమంటే, రాజకీయంగా ముందుగానే రంగంలోకి దిగడమే అని విశ్లేషకులు అంటున్నారు. ఈ పొత్తు ప్రభావం ఎన్నికల ఫలితాలపై ఎంత ఉంటుందో చూడాలి కానీ ఇప్పటికి తమిళ రాజకీయాల్లో ఈ కూటమి చర్చకు కేంద్రబిందువై ఉంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

గ్యాస్ సిలెండర్ల బుకింగ్ పై కేంద్రం మరో షాక్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

బెంగళూరులో రేపటి నుంచి హోటళ్లు బంద్

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై విపక్షాలు అవిశ్వాస తీర్మానం

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

యాసిడ్ బాధితులకు ఉద్యోగాలు ఇవ్వాలి – సుప్రీంకోర్టు ఆదేశం

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

భారీ నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

కొత్త అద్దె చట్టం అమల్లోకి: అద్దెదారులు, యజమానులకు కీలక మార్పులు

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

ఇరాన్‌ ఆయిల్‌ నిల్వలపై ఇజ్రాయెల్‌ దాడులు..

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

దేశంలో 14 మంది మహిళా బిలియనీర్లు.. టాప్-3 ఏపీ నుంచే

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

పెట్రోల్, డీజిల్ ధరల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న‌

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ఫోన్‌లో ‘చైల్డ్ పోర్నోగ్రఫీ’ ఉన్నా జైలుకే!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్!. ఎలాన్ మస్క్ షాకింగ్ రియాక్షన్!

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

పశ్చిమాసియా సంక్షోభం: శాంతి, దౌత్యమే భారత మార్గం

📢 For Advertisement Booking: 98481 12870