हिन्दी | Epaper
అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు అభ్యర్థుల మధ్య లొల్లి చైర్ పర్సన్/మేయర్ ఎన్నిక తగ్గిన టమాటా ధరలు నిజామాబాద్, కరీంనగర్లో బిజెపి జెండా! జలమండలి పునర్వ్యవస్థీకరణ తెలంగాణకు శుభవార్త ఎన్నికల పోలింగ్ ఎంతంటే? ముగిసిన మున్సిపల్ పోలింగ్ కోఠిలో కాల్పులు, ఏటీఎం టార్గెట్! రూ.6 లక్షల దోపిడీ అత్తతో కలిసి మేనమామను చంపిన మేనల్లుడు

Anchor Ravi: క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి..వీడియో వైరల్

Sharanya
Anchor Ravi: క్షమాపణలు చెప్పిన యాంకర్ రవి..వీడియో వైరల్

ప్రముఖ యాంకర్ రవి హోస్ట్ చేస్తున్న ఓ టీవీ షోలో ఇటీవల ప్రసారమైన ఒక స్కిట్ పెద్ద వివాదానికి దారి తీసింది. సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ అనే కార్యక్రమంలో సుడిగాలి సుధీర్ టీమ్ ప్రదర్శించిన స్కిట్‌లో హిందూ సంప్రదాయాలకు విరుద్ధంగా ఉన్న సన్నివేశం చూపించారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ స్కిట్‌లో ఒక వ్యక్తి నందీశ్వరుడి కొమ్ముల్లోంచి చూస్తే శివలింగం కనిపించాల్సిన చోట ఓ యువతి కనిపించడం చూపించారు. ఇది హిందూ ధర్మాన్ని, నమ్మకాలను కించపరచేలా ఉందంటూ, హిందూ సంఘాలు, సామాజిక మాధ్యమాల్లో శ్రద్ధావంతుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా రాష్ట్రీయ వానరసేన వంటి హిందూ ఆర్గనైజేషన్‌లు ఈ వ్యవహారంపై మండిపడుతున్నాయి.

రవి స్పందన

ఈ క్రమంలో యాంకర్ రవి స్పందిస్తూ, ఒక వీడియో ద్వారా ప్రజల క్షమాపణ కోరారు. వీడియోలో ఆయన మాట్లాడుతూ— అందరికీ నమస్కారం అండీ. ఇటీవల నేను, కొందరు ఆర్టిస్టులు సూపర్ సీరియల్ ఛాంపియన్ షిప్ అనే కార్యక్రమం చేశాం. ఇందులో మేం ఒక స్పూఫ్ చేశాం. ఇది కావాలనే ఎవ్వరినైనా కించపరచాలన్న ఉద్దేశంతో చేయలేదు. మేము స్పూఫ్ చేసిన సీన్, చిరంజీవిగారి సినిమాలో ఉన్నదే. అది ఎంటర్టైన్‌మెంట్ పరంగా మాత్రమే చేసిన పని. అయితే దీని వల్ల చాలామంది హిందువులు బాధపడ్డారని తెలిసింది. అలా చేయడం తప్పు అని చాలా కాల్స్ వస్తున్నాయి. అందుకే ఇకపై అలాంటివి జరగకుండా మేము జాగ్రత్త పడతాం. జై శ్రీరామ్, జై హింద్. — అని యాంకర్ రవి తన వీడియోలో పేర్కొన్నారు. రవి చేసిన ఈ వివరణపై ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అతని స్పందనను స్వీకరించగా, మరికొందరు మాత్రం దీన్ని తేలికపాటి స్పందనగా అభివర్ణిస్తున్నారు.

Read also: Anchor Ravi: యాంకర్ రవిని హెచ్చరించిన వానరసేన..ఆడియోకాల్ వైరల్

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870