हिन्दी | Epaper
జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు జన్మభూమి ఎక్స్‌ప్రెస్ టైమింగ్స్ మార్పు విజయనగరం లో అగ్నిప్రమాదం.. 2027 గోదావరి పుష్కరాల తేదీలు ఖరారు లోయలోపడిన బస్సు.. 8 మంది మృతి ఉద్యోగులకు డీఏ శుభవార్త నేడు ఏపీ కేబినెట్ భేటీ మహిళాభివృద్ధి & శిశు సంక్షేమ శాఖలో పోస్టులు చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం తిరుపతి-సాయినగర్ ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి TET పరీక్షలు

AP Govt : అంగన్వాడీ పిల్లలకు శనగలు, ఎగ్ ఫ్రైడ్ రైస్

Sudheer
AP Govt : అంగన్వాడీ పిల్లలకు శనగలు, ఎగ్ ఫ్రైడ్ రైస్

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో అందించే మధ్యాహ్న భోజన మెనూలో ముఖ్యమైన మార్పులు చేయాలని నిర్ణయించింది. చిన్నారుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రుచికరంగా ఉండే అధిక పోషక విలువలు కలిగిన ఆహారాన్ని అందించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వారంలో రెండు రోజులు పిల్లలకు ఎగైడ్ రైస్, ఉదయం ఉడికించిన శనగలు అందించనున్నారు.

మునగపొడి, చక్కెర స్థాయిలో మార్పులు

ప్రతిరోజు అందే కూరల్లో మునగపొడిని ఉపయోగించనున్నట్టు అధికారులు తెలిపారు. మునగపొడి శరీరానికి అవసరమైన విటమిన్లు, ఖనిజాలు అందించే శక్తివంతమైన పదార్థంగా గుర్తించారు. అంతేకాకుండా చిన్నారులకు ఇచ్చే ‘బాలామృతం’లో చక్కెర స్థాయిని తగ్గించే నిర్ణయం తీసుకున్నారు. ఇది వారి ఆరోగ్యంపై మంచిపరిణామాలు చూపుతుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

AP Anganwadi children

పైలట్ ప్రాజెక్టుగా విజయవంతం – రాష్ట్రవ్యాప్తంగా అమలు

ఈ మార్పులను తొలుత పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలోని నాలుగు జోన్ల పరిధిలోని ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో ప్రయోగాత్మకంగా అమలు చేశారు. ఈ ప్రయత్నానికి మంచి స్పందన రావడంతో, త్వరలోనే 26 జిల్లాల్లోని ఒక్కో అంగన్వాడీ కేంద్రంలో ఈ కొత్త మెనూను అమలు చేయనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ విధానం అమలవుతుందనేది అధికారుల భావన. చిన్నారుల పోషణను మెరుగుపరిచే దిశగా ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుంటోంది.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870