పవన్ కళ్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ సింగపూర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన విషయం తెలిసిందే. ఈ సంఘటనతో పవన్ అభిమానుల్లో, కుటుంబసభ్యుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. స్కూల్‌లో దట్టమైన పొగ చుట్టుముట్టిన దృశ్యాలు మీడియాలో కనిపించడంతో ప్రమాద తీవ్రత స్పష్టమైంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చేతులకు గాయాలు అయినట్టు సమాచారం వచ్చింది.
ఆసుపత్రి ఫోటో వైరల్ – ఫ్యాన్స్‌కు ఊరట
ఈ అగ్నిప్రమాదం తర్వాత మార్క్ శంకర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోలో మార్క్ చేతికి కట్టు వేసుకొని, ఆక్సిజన్ మాస్క్ ధరించి కనిపిస్తున్నాడు. ఈ పిక్ చూస్తే బాబు పరిస్థితి స్టేబుల్‌గా ఉందన్న అంచనాకు అభిమానులు వచ్చారు. తీవ్రమైన పరిస్థితి కాకపోవడంతో ఫ్యాన్స్ కొంతవరకు ఊరట పడ్డారు. ప్రస్తుతం అతను జనరల్ వార్డ్‌కు షిఫ్ట్ అయినట్టు సమాచారం.

పవన్ కుటుంబం భరోసాగా – సినీ, రాజకీయ ప్రముఖుల మద్దతు
మార్క్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకునేందుకు పవన్ కళ్యాణ్ వెంటనే సింగపూర్‌కు చేరగా, మెగాస్టార్ చిరంజీవి, సురేఖ కూడా అతనిని పరామర్శించడానికి వెళ్లారు. బాబును పలువురు సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు పరామర్శించడంతో పవన్‌కు మద్దతుగా నిలిచారు. బాబు త్వరగా కోలుకోవాలంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు సందేశాలు వెల్లువెత్తించారు. ప్రస్తుతం మార్క్ కోలుకోవడం ప్రారంభించగా, పూర్తి స్వస్థతకు కొంత సమయం పడనుందని వైద్యులు తెలిపారు.