Key comments by Eatala Rajender on BJP president

Eatala Rajendar: బీజేపీ అధ్యక్ష పదవీ పై ఈటల కీలక వ్యాఖ్యలు

Eatala Rajendar: బీజేపీ అధ్యక్ష పదవి మార్పు ఎప్పుడూ ఉంటుందని విలేకరులు అడిగిన ప్రశ్నకు పార్టీ నేత, ఎంపీ ఈటల రాజేందర్ స్పందించారు. మా పార్టీలో అధ్యక్షులు పదేళ్లు, ఇరవై ఏళ్లు వారసత్వంగా ఉండరు.. అని ఈటల హాట్ కామెంట్స్ చేశారు. మా ఢిల్లీ నాయకత్వం అంతా సమగ్రమైన ఆలోచనతో ప్రణాళికతో ఉన్నారని అన్నారు. బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కంటోన్మెంట్ లో జెండా పండుగ నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో 70% రాష్ట్రాల్లో బీజేపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తుందని చెప్పారు.

Advertisements
బీజేపీ అధ్యక్ష పదవీ పై ఈటల

బీజేపీ మాత్రమే నిజమైన పార్టీ

గత పార్లమెంట్ ఎన్నికల్లో 35% ఓటు సాధించి సగం ఎంపీ సీట్లు గెలుచుకుని రేపటి ఎన్నికల్లో తెలంగాణలో ఏర్పడే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వమేనని ప్రజలు మెసేజ్ అందించారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీని చూసినం వారి పరిపాలన అనుభవమైందని, మళ్లీ ఓటు వేసే ప్రసక్తి లేదని ప్రజలు అంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 10 నెలల కాలంలోనే ప్రజాక్షేత్రంలో విఫలమైందన్నారు. కాబట్టి రాబోయే కాలంలో రాష్ట్రం సురక్షితంగా సుభిక్షంగా అభివృద్ధి పథంలో నడపాలంటే బీజేపీ మాత్రమే నిజమైన పార్టీ అని ప్రజల్లో భావన ఉంది కాబట్టి.. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా గెలిచేది బీజేపీ పార్టీనే అని జోస్యం చెప్పారు.

వక్ఫ్ బిల్లు ద్వారా భూసమస్యలకు పరిష్కారం

బీజేపీ సిద్ధాంత ప్రాతిపదికన పనిచేసే పార్టీ అని అనేక మంది పార్టీ మేలు కోరేవారు, మద్దతు తెలిపే సంఘాలు ఉంటాయి. మన పార్టీలో ఎవరు పోటీచేసినా వ్యక్తులతో సంబంధం లేకుండా గెలుపు కోసం ప్రయత్నం చేస్తారన్నారు. వక్ఫ్ బిల్లు ద్వారా అనేక మంది 30-40 ఏళ్లుగా పడుతున్న భూసమస్యలకు పరిష్కారం దక్కనుందని చెప్పారు. పడుతున్న బాధలకు పరిష్కారం ఇవ్వనుంది. 14 దేవాలయం మీద దాడి జరిగితే అందులో మన దగ్గర ఉన్న ముత్యాలమ్మ గుడి కూడా ఉంది.

Related Posts
Bhattacharya: శాస్త్రవేత్త జే భట్టాచార్య NIH డైరెక్టర్‌గా నియమితం
శాస్త్రవేత్త జే భట్టాచార్య NIH డైరెక్టర్‌గా నియమితం

అమెరికాలోని ప్రముఖ ఆరోగ్య పరిశోధనా సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హెల్త్ (NIH) డైరెక్టర్‌గా భారతీయ-అమెరికన్ శాస్త్రవేత్త డాక్టర్ జే భట్టాచార్య నియమితులయ్యారు. ఆయన నియామతను US Read more

‘పుష్ప-2’ ఎన్ని థియేటర్లలో రిలీజ్ అవుతుందో తెలుసా..?
pushpa 2 trailer views

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌, ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌స్తున్న భారీ చిత్రం పుష్ప‌-2. ఈ సినిమా డిసెంబ‌ర్ 5న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇప్ప‌టికే Read more

నాంప‌ల్లి నుమాయిష్ 17వ తేదీ వ‌ర‌కు పొడిగింపు
Extension of Nampally Numaish till 17th

రెండు రోజులు పొడిగించేందుకు పోలీస్ శాఖ అనుమతి హైదరాబాద్ : నగర ప్రజలు ఎంతగానో ఎంజాయ్ చేసే నాంపల్లి నుమాయిష్ మరో రెండు రోజులు కొనసాగనుంది. ఫిబ్రవరి Read more

Sachin Tendulkar: సచిన్ టెండుల్కర్‌తో బిల్‌గేట్స్‌ భేటీ
Bill Gates meets Sachin Tendulkar

Sachin Tendulkar: భార‌త ప‌ర్య‌ట‌న‌లో ఉన్న మైక్రోసాఫ్ట్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిల్ గేట్స్ గురువారం నాడు భార‌త క్రికెట్ దిగ్గ‌జం స‌చిన్ టెండూల్క‌ర్‌ను క‌లిశారు. ఈ సంద‌ర్భంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×