Pavan to launch 'Adavi Thalli Bata' from today

Pawan Kalyan : నేటి నుంచి ‘అడవితల్లి బాట’ప్రారంభించనున్న పవన్

Pawan Kalyan : ఏపీ ప్రభుత్వం గిరిజన ప్రాంతాల అభివృద్ధి కోసం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతోంది. ఈ మేరకు ‘అడవి తల్లి బాట’ పేరుతో గిరిజన గ్రామాల్లో పూర్తిస్థాయిలో రోడ్ల అభివృద్ధికి డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ చొరవతో అడుగులు పడనున్నాయి. ఈ నేపథ్యంలో గిరిజన గ్రామాల్లో రెండు రోజులపాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. అల్లూరు సీతారామరాజు జిల్లాలో రెండు రోజులపాటు డిప్యుటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. ఈరోజు (7వ తేదీ) ఉదయం విశాఖపట్నం విమానాశ్రయం నుంచి నేరుగా అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం పెదపాడు గ్రామంలోని గిరిజన ఆవాసాలను సందర్శించనున్నారు.

Advertisements
నేటి నుంచి ‘అడవితల్లి బాట’

రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన

అడవి తల్లి బాట పేరిట చేపట్టే రోడ్ల నిర్మాణానికి పవన్ కళ్యాణ్ శంకుస్థాపన చేయనున్నారు. అక్కడే బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు. 8వ తేదీ ఉదయం అరకు మండలం, సుంకరమిట్టలో పర్యటించనున్నారు. అక్కడ నిర్మించిన ఉడెన్ బ్రిడ్జి ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. తర్వాత అక్కడి నుంచి విశాఖపట్నం ఇందిరాగాంధీ జూలాజికల్ పార్కుకు పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. అక్కడ ఎకో టూరిజంపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్రంలో పర్యాటక అభివృద్ధి, ఎకో టూరిజంకు ఉన్న అవకాశాలపై చర్చించనున్నారు. గిరిజన గ్రామాల మధ్య అనుసంధాన రోడ్ల అభివృద్ధి, రాష్ట్రంలో ఎకో టూరిజం ప్రోత్సాహంపై పవన్ కళ్యాణ్ ప్రధాన దృష్టిసారించనున్నారు.

Related Posts
KTR : టీడీపీ ఘ‌న‌త ఎన్‌టీఆర్‌కే చెందుతుంద‌న్న కేటీఆర్‌
KTR టీడీపీ ఘ‌న‌త ఎన్‌టీఆర్‌కే చెందుతుంద‌న్న కేటీఆర్‌

KTR : టీడీపీ ఘ‌న‌త ఎన్‌టీఆర్‌కే చెందుతుంద‌న్న కేటీఆర్‌ బారతీయ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) 25 ఏళ్ల విజయ యాత్రను పురస్కరించుకుని పార్టీ నేతలు కార్యకర్తలతో సమావేశం Read more

నేడు పోలీసుల విచారణకు అల్లు అర్జున్..!
Allu Arjun will be questioned by the police today.

హైదరాబాద్‌ : హైదరాబాద్‌ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట కేసులో సినీ నటుడు అల్లు అర్జున్‌కు సోమవారం చిక్కడపల్లి పోలీసులు నోటీసులు జారీ చేసిన Read more

‘రాజా సాబ్’ కొత్తలుక్ లో ప్రభాస్
'రాజా సాబ్' కొత్తలుక్ లో ప్రభాస్

సంక్రాంతి మరియు పొంగల్ సందర్భంగా రాబోయే చిత్రం 'ది రాజా సాబ్' నుండి కొత్త పండుగ పోస్టర్ ను మంగళవారం ఆవిష్కరించబడింది. ఈ పోస్టర్ లో ప్రభాస్ Read more

మన్మోహన్ మృతి… వారం రోజులు సంతాప దినాలుగా ప్రకటించిన కేంద్రం
Union Government is set to

భారతదేశ రాజకీయ చరిత్రలో అమూల్యమైన వ్యక్తిత్వం, సౌమ్యతకు ప్రతీకగా నిలిచిన మన్మోహన్ సింగ్ మృతి దేశాన్ని విషాదంలో ముంచింది. ఆయన భారత ఆర్థిక రంగానికి చేసిన సేవలు, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×