టీడీపీ నేత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానీ తనయుడు వినీల్ పుట్టినరోజు వేడుకలు ఈసారి ఎప్పటికీ గుర్తుండిపోయేలా జరిగాయి. ప్రత్యేకత ఏమిటంటే, ఈ వేడుకలు ఎక్కడో తెలంగాణలో, ఆంధ్రాలో కాదు.ఆస్ట్రేలియాలోని గోల్డ్ కోస్ట్ నగరంలో జరిగాయి.అయితే అక్కడ ఫ్రెండ్స్ వేసిన ప్లాన్‌కి ఇప్పుడు సోషల్ మీడియాలో పాజిటివ్ గాలే వీస్తోంది! వినీల్ స్నేహితులు, ఎన్ఆర్ఐ టీడీపీ సభ్యులు కలసి ఓ అద్భుతమైన ఆశ్చర్యాన్ని ప్లాన్ చేశారు. గోల్డ్ కోస్ట్ గగనతలంలో ఓ విమానాన్ని ఎగురవేశారు.ఆ విమానానికి ఒక భారీ బ్యానర్‌ను జత చేశారు.
అందులో “Happy Birthday Pulivarthi Vineel” అనే శుభాకాంక్షలు ఉండటం విశేషం.ఆ బ్యానర్ గాల్లో అలరించగా, చూసిన ప్రతి ఒక్కరూ ఆశ్చర్యంతో నిమగ్నమయ్యారు.ఇలా ఓ వ్యక్తి పుట్టినరోజు కోసం విమానం వినూత్నంగా వినియోగించడం గొప్పగా మారింది. ఈ అద్భుత దృశ్యాన్ని ఎమ్మెల్యే పులివర్తి నాని సోషల్ మీడియాలో షేర్ చేశారు. వీడియో నెటిజన్లను ఆకట్టుకుంటోంది.పుట్టినరోజుని అంతగా ప్రత్యేకంగా మార్చిన ఈ గిఫ్ట్ ఇప్పుడు టీడీపీ వర్గాల్లో కూడా చర్చనీయాంశమైంది. వినీల్‌కు విషెస్ చెప్పేందుకు పార్టీ సీనియర్‌లు, కార్యకర్తలు సోషల్ మీడియాలో పోస్ట్‌లు చేస్తున్నారు.పులివర్తి నాని, తన కుమారుడి పట్ల ఉన్న ప్రేమను ఈ పోస్ట్‌లో బాగా వ్యక్తపరిచారు. “నన్ను గర్వపడేలా చేసే నా కొడుకుకు జన్మదిన శుభాకాంక్షలు” అంటూ ఆయన ఎమోషనల్ మెసేజ్ షేర్ చేశారు.ఇలాంటి వినూత్న పుట్టినరోజు వేడుకలు సాధారణంగా అందరికి ఉండవు. కానీ పులివర్తి వినీల్‌కు మాత్రం ఇది గుర్తుండిపోయే కానుకగా నిలిచింది. విమానం మీద బర్త్ డే విషెస్… అది కూడా విదేశాల్లో… ఇంకేముంటుంది భయ్యా! స్టైల్ అంటే ఇదే అంటున్నారు నెటిజన్లు.