ఐపీఎల్ 2025 సీజన్లో ముంబయి ఇండియన్స్ (MI) మరియు లక్నో సూపర్ జెయింట్స్ (LSG) మధ్య జరిగిన పోరులో తిలక్ వర్మ రిటైర్డ్ హర్ట్ కావడం క్రికెట్ వర్గాల్లో పెద్ద చర్చకు దారి తీసింది. మ్యాచ్ మధ్యలో అతన్ని పిలిపించేసిన ముంబయి యాజమాన్యం చర్యపై అనేక విమర్శలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా ఆ సమయంలో తిలక్ మంచి ఫామ్‌లో ఉండగా, అతడిని తప్పించి మిచెల్ శాంట్నర్‌ను క్రీజులోకి పంపడం ఆశ్చర్యానికి గురిచేసింది.

సూర్యకుమార్ రియాక్షన్ వీడియో వైరల్
ఈ పరిణామానికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అందులో ముంబయి కోచ్ మహేల జయవర్ధనే ఈ విషయాన్ని ముందే సూర్యకుమార్ యాదవ్‌కు చెబుతుండగా, అతను షాక్ అయ్యాడు. ఎందుకు? అనే ప్రశ్నతో స్పందించిన సూర్యకు కోచ్ సమాధానం ఇవ్వగా అది కెమెరాలో చిక్కింది. ఈ వీడియో నెటిజన్లలో సంచలనం సృష్టిస్తోంది. క్రీడా విశ్లేషకులు, మాజీ క్రికెటర్లు ఈ చర్యపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఒక యువ ఆటగాడిని, ముఖ్యంగా గతేడాది అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌ను ఈ విధంగా మధ్యలో బయటకు రప్పించడం అతడి కాన్ఫిడెన్స్‌ను దెబ్బతీసే అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు. తిలక్ వర్మ, గతేడాది ముంబయి తరఫున రోహిత్ శర్మ తర్వాత అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతని స్థిరమైన ప్రదర్శన వల్లే టీమిండియాలో కూడా చోటు దక్కింది.
తిలక్ వర్మ రికార్డులు
తిలక్ వర్మ ఇప్పటివరకు 25 టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌లలో 50 సగటుతో 749 పరుగులు సాధించాడు. ఇందులో రెండు శతకాలు ఉండటం విశేషం. దక్షిణాఫ్రికా పర్యటనలో వరుసగా రెండు సెంచరీలు చేసి, టీమిండియా ఫ్యూచర్ స్టార్‌గా గుర్తింపు పొందాడు. అలాంటి ఆటగాడిని మ్యాచ్ మధ్యలో రిటైర్డ్ హర్ట్ చేయడం సమంజసం కాదని నెటిజన్లు మండిపడుతున్నారు. తిలక్ వర్మ బదులుగా వచ్చిన మిచెల్ శాంట్నర్ కేవలం రెండు బంతులు మాత్రమే ఆడి తిరిగి వెనుదిరిగాడు. ఇది ముంబయి నిర్ణయం ఎంత పెద్ద తప్పిదమో స్పష్టంగా చూపిస్తోంది. ఒక ముఖ్యమైన సమయంలో ముఖ్యమైన ఆటగాడిని తీసేసి, ఇమాకులా బ్యాటింగ్ చేయని ఆటగాడిని పంపితే ఫలితం ఎలా ఉంటుందో అందరికీ అర్థమవుతోంది.
హార్దిక్ ఆల్‌రౌండ్ ప్రదర్శన వృథా
ఈ మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ 203 పరుగుల లక్ష్యాన్ని ముంబయికి నిర్దేశించింది. ముంబయి 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 191 పరుగులు మాత్రమే చేయగలిగింది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా బ్యాటుతో 28 పరుగులు చేయగా, బంతితో ఐదు వికెట్లు తీసి మంచి ఆల్‌రౌండ్ ప్రదర్శన ఇచ్చాడు. అయినప్పటికీ జట్టును గెలిపించలేకపోయాడు.
Also read: MS Dhoni : ధోనీ మళ్లీ కెప్టెన్‌గానే గ్రౌండ్లోకి వస్తాడా?