Gautam Rao is BJP MLC candidate for Hyderabad local bodies

BJP: హైదరాబాద్‌ స్థానిక సంస్థల బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్‌రావు

BJP : హైదరాబాద్ స్థానిక సంస్థల కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థి పేరును పార్టీ అధిష్టానం శుక్రవారం ప్రకటించింది. ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎన్.గౌతం రావు పేరును బీజేపీ హైకమాండ్ ఖరారు చేసింది. ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ ఎం.ఎస్ ప్రభాకర్ పదవీకాలం మే 1తో ముగియనుంది. దీంతో కొత్త ఎమ్మెల్సీ ఎన్నికకు ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది.

Advertisements
హైదరాబాద్‌ స్థానిక సంస్థల బీజేపీ

నేటితో నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ

హైదరాబాద్‌ స్థానిక సంస్థల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికకు మార్చి 24న కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. నేటితో (శుక్రవారం) నామినేషన్ల స్వీకరణకు చివరి తేదీ. దీంతో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతం రావు పేరును ఖరారు చేసింది హైకమాండ్. మరికాసేపట్లో గౌతం రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ఏప్రిల్ 25న ఓట్ల లెక్కింపు

ఏప్రిల్ 7న నామినేషన్ల పరిశీలన ప్రక్రియ జరుగనుండగా.. ఏప్రిల్ 9 నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ. ఇక ఏప్రిల్ 23న పోలింగ్ జరుగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ 25న నిర్వహించి, ఫలితాలను అధికారికంగా ప్రకటించనున్నారు. హైదరాబాద్ స్థానిక సంస్థల నియోజవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో కోడ్ అమలులోకి వచ్చింది.

Related Posts
భారత్ సౌకర్యాలపై ఆకర్షితురాలైన అమెరికా యువతి
భారత్ సౌకర్యాలపై ఆకర్షితురాలైన అమెరికా యువతి

భారతదేశం అంటే అభివృద్ధి చెందుతున్న దేశంగా భావించే అమెరికన్లు, ఇక్కడ అందుబాటులో ఉన్న కొన్ని సౌకర్యాలను చూసి ఆశ్చర్యపోతున్నారు. అమెరికాకు చెందిన యువతి క్రిస్టెన్ ఫిషర్, ప్రస్తుతం Read more

Waqf Amendment Bill : ఎల్లుండే లోక్సభలోకి వక్స్ సవరణ బిల్లు?
Waqf Amendment Bill 2

వక్ఫ్ చట్టం భారతదేశంలో ముస్లిం సమాజానికి సంబంధించిన ధార్మిక, సామాజిక అంశాలను పరిరక్షించడానికి రూపొందించబడింది. కానీ ప్రస్తుత చట్టంలో కొన్ని లోపాలు ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. Read more

ఆప్ నేతల మీడియా పర్యటన: బిజెపి ఆరోపణలకు ప్రతిస్పందన
ఆప్ నేతల మీడియా పర్యటన: బిజెపి ఆరోపణలకు ప్రతిస్పందన

ముఖ్యమంత్రి నివాసంలోకి ప్రవేశించకుండా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, ఢిల్లీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ ను పోలీసులు అడ్డుకోవడంతో బుధవారం ఢిల్లీ పోలీసులతో ఆప్ నేతల మధ్య Read more

ఉక్రెయిన్‌కు ట్రంప్ మిలటరీ సాయం నిలిపివేత
ఉక్రెయిన్‌కు ట్రంప్ మిలటరీ సాయం నిలిపివేత

రష్యాతో యుద్ధంలో ఉన్న ఉక్రెయిన్‌కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఊహించని షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు అందిస్తున్న మిలటరీ సాయాన్ని నిలిపివేస్తూ ఆయన ఆదేశాలు జారీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×