Hail showers in Telugu states today and tomorrow!

Rains: తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వడగండ్ల వానలు!

Rains : తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు పడనున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో నేడు, రేపు వర్షాలు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని IMD తెలిపింది. ఏపీలోని ఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా పరిసర ప్రాంతాల్లో కొన్ని చోట్ల పిడుగులు పడతాయని, గంటకు 40 నుంచి 50 కి. మీ. వేగంతో గాలులూ వీయొచ్చని పేర్కొంది.

Advertisements
తెలుగు రాష్ట్రాల్లో నేడు రేపు

పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ

తెలంగాణలో మరో రెండు రోజులు వడగండ్ల వానలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో కొన్ని జిల్లాల్లో జనజీవనం తీవ్రంగా ప్రభావితమైంది. ముఖ్యంగా ఆదిలాబాద్, హైదరాబాద్, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్‌కర్నూల్, కర్నూలు, కడప, చిత్తూరు వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదయ్యాయి. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం.. ఇవాళ, రేపు కూడా వర్షాలు కొనసాగే అవకాశం ఉంది. దీంతో తల్లిదండ్రులు స్కూళ్లకు సెలవు ప్రకటించాలని కోరుతున్నారు.

ఆశ్రయం కోసం సురక్షిత ప్రదేశాలను ఎంచుకోవాలని సూచిన

కాగా, ఇప్పటికే కొన్ని జిల్లాలకు ఐఎండీ అధికారులు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. నిజామాబాద్‌, కామారెడ్డి, హైదరాబాద్‌, ఆదిలాబాద్‌ పరిసరాల్లో గంటకు 30-50 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. నేడు, రేపు ఆదిలాబాద్‌, వికారాబాద్‌, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లో పిడుగులు పడతాయని హెచ్చరించారు. ప్రజలు బయట తిరగడం తగ్గించి, ఆశ్రయం కోసం సురక్షిత ప్రదేశాలను ఎంచుకోవాలని సూచించారు.

Related Posts
Andhra pradesh: ఆంధ్రాలో హాల్ట్ స్టేషన్లు..
Andhra pradesh: ఆంధ్రాలో హాల్ట్ స్టేషన్లు..

వేసవి సెలవులు ప్రారంభమయ్యే వేళ పుణ్యక్షేత్రాల సందర్శనకు భక్తులు, పర్యాటకులు సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా శ్రీవారి దర్శనం కోసం వెళ్లే భక్తులకు ఇది ఒక మంచి అవకాశం. ఈ Read more

25న శ్రీకాళహస్తికి సీఎం చంద్రబాబు
ఏపీ యువతకు చంద్రబాబు శుభవార్త

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ శైవక్షేత్రమైన శ్రీకాళహస్తిలో ఫిబ్రవరి 21 నుండి 13 రోజుల పాటు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. ఈ ఉత్సవాల్లో భక్తుల సందడి నెలకొననుండగా, Read more

CM Revanth Reddy : కేటీఆర్ నాకు, నీకు పోలికే లేదు : సీఎం రేవంత్ రెడ్డి
CM Revanth Reddy comments on ktr

CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి రవీంద్రభారతిలో కొలువుల పండుగ కార్యక్రమంలో మాట్లాడుతూ కేటీఆర్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ నాకు, నీకు పోలికే Read more

Russia: విక్టరీ డే పరేడ్‌ వేడుకల్లో పాల్గొనాలని మోదీని ఆహ్వానించిన రష్యా
విక్టరీ డే పరేడ్‌ వేడుకల్లో పాల్గొనాలని మోదీని ఆహ్వానించిన రష్యా

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కి రష్యా నుంచి మరోసారి ఆహ్వానం అందింది. మే 9న నిర్వహించే విక్టరీ డే పరేడ్‌ వేడుకల్లో పాల్గొనాలని మోదీకి క్రెమ్లిన్‌ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×