నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న’అర్జున్ సన్నాఫ్ వైజయంతి‘ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుంది.ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది.ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు.చాలాకాలం తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో నటించడంతో ఈ సినిమాపై అందరి దృష్టి నెలకొంది. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు అదిరిపోయేలా ఉండబోతున్నాయని తెలుస్తోంది. కల్యాణ్ రామ్ కెరీర్‌లో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఆయన అభిమానులు భావిస్తున్నారు’అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలో తెలుస్తాయి. ఈ సినిమా ఏప్రిల్ 18న విడుదల కానుండటంతో కల్యాణ్ రామ్ అభిమానుల్లో ఉత్సాహం నెలకొంది.

విజయశాంతి ఈ సినిమాలో వైజయంతి ఐపీఎస్ అనే పాత్రను పోషించడం ప్రేక్షకులలో మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.గతం లో విజయశాంతి నటించిన సూపర్ హిట్ చిత్రం కర్తవ్యంలో ఆమె పోషించిన పాత్ర పేరు కూడా వైజయంతి ఐపీఎస్ కావడం విశేషం.అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలో నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతితో పాటు సోహైల్ ఖాన్, సయీ మంజ్రేకర్, శ్రీకాంత్, పృథ్వీరాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘అర్జున్ సన్నాఫ్ వైజయంతి’ ఏప్రిల్ 18న థియేటర్లలో విడుదల కానుంది. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ ఎన్టీఆర్ ఆర్ట్స్ అధికారికంగా ప్రకటించింది.ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో కనిపించనున్నారు.చాలాకాలం తర్వాత ఆమె మళ్లీ సినిమాల్లో నటిస్తుండటంతో ఈ సినిమాపై అందరి దృష్టి నెలకొంది. అశోక్ వర్ధన్ ముప్పా, సునీల్ బలుసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఇటీవల విడుదలైన టీజర్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.