Bomb threats to Medchal Collectorate

Bomb Threat : మేడ్చల్‌ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు

Bomb Threats : మేడ్చల్ జిల్లా కలెక్టరేట్‌కు ఈ రోజు బాంబు బెదిరింపు సందేశం వచ్చింది. జిల్లా కలెక్టర్ గౌతం మెయిల్‌కు ఈ బెదిరింపు మెసేజ్ వచ్చినట్టు సమాచారం. ఈ మెయిల్‌లో మధ్యాహ్నం 3:30 గంటలకు కలెక్టరేట్‌ను బాంబులతో పేల్చేయడంతో పాటు జిల్లా కలెక్టర్‌ను హత్య చేస్తామని పేర్కొన్నట్టు తెలుస్తోంది.
ఈ వార్త వెలుగులోకి రాగానే కలెక్టరేట్ సిబ్బంది తీవ్ర ఉత్కంఠకు గురయ్యారు. అందరూ ఆందోళన వ్యక్తం చేస్తూ, చిన్న చిన్న గుంపులుగా ఏర్పడి చర్చించుకోవడం కనిపించింది. సమాచారం అందుకున్న పోలీసులు తక్షణమే జిల్లా కలెక్టర్ గౌతంతో పాటు అదనపు కలెక్టర్‌ను కలిసి సమీక్ష నిర్వహించారు.

Advertisements
మేడ్చల్‌ కలెక్టరేట్‌కు బాంబు బెదిరింపులు

అత్యవసరం సమావేశం ఏర్పాటు చేసిన కలెక్టర్

ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ గౌతం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి అధికారులతో చర్చించారు. ఇక ఈ బెదిరింపు కరీంనగర్ జిల్లా నుంచి లక్ష్మణ్ రావు అనే 70 ఏళ్ల వ్యక్తి ద్వారా వచ్చిందని అధికారులు గుర్తించారు. మెయిల్‌లో పేర్కొన్న సమాచారం ప్రకారం, లక్ష్మణ్ రావు గతంలో మావోయిస్టు సభ్యుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. అంతేకాదు, మెయిల్ చివర్‌లో ముస్లిం నినాదం కూడా పొందుపరిచినట్టు అధికార వర్గాలు వెల్లడించాయి.

ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నట్లు వెల్లడి

అయితే, ఇప్పటివరకు అనుమానాస్పద వస్తువులేవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం తనిఖీలు కొనసాగుతున్నట్లు వెల్లడించారు. మరోవైపు బెదిరింపులు ఎక్కడి నుంచి వచ్చాయన్నదానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కలెక్టరేట్ లోని అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులను బయటకు పంపించిన పోలీసులు డాగ్ స్క్వాడ్ తో తనీఖీలు చేపట్టారు.

Related Posts
పెప్సికో ఇండియా రివల్యూషనరి అవార్డ్స్
PepsiCo India Revolutionary Awards

వ్యవసాయ రంగానికి తోడ్పడుతున్న మహిళలను ప్రశంసించే విలక్షణమైన వేదిక రివల్యూషనరి అవార్డ్స్, పెప్సికో ఇండియా వారిచే ప్రారంభించబడింది. హైదరాబాద్‌: తెలంగాణ నుండి గణపతి సెల్ఫ్-హెల్ప్ గ్రూప్ (SHG) Read more

Guntur: గుంటూరు నగర మేయర్ రాజీనామా!
Guntur City Mayor resigns!

Guntur: గుంటూరు నగర మేయర్ పదవికి కావటి మనోహర్ నాయుడు రాజీనామా చేశారు. నగరకమిషనర్‌ తీరుకు నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో రెడ్ Read more

గేమ్ ఛేంజర్ టికెట్ ధరలపై హైకోర్టులో విచారణ
గేమ్ ఛేంజర్ టికెట్ ధరలపై హైకోర్టులో విచారణ

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి బి. విజయసేన్ రెడ్డి గురువారం టికెట్ ధరల పెరుగుదలపై దాఖలైన రెండు రిట్ పిటిషన్లను విచారణకు స్వీకరించారు. ఈ పిటిషన్లు, "గేమ్ ఛేంజర్" Read more

Jagan : డ్యామేజ్ అయిన జగన్ హెలికాప్టర్…
Jagan డ్యామేజ్ అయిన జగన్ హెలికాప్టర్

వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ సీఎం జగన్‌మోహన్ రెడ్డి రాప్తాడు నియోజకవర్గంలో ఇవాళ పర్యటించారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ఈ ప్రాంతంలో ఇటీవల దారుణంగా హత్యకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×