हिन्दी | Epaper
భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్ భవిష్యత్తులో సన్యాసం తీసుకునే ఛాన్స్ ఉంది – రేణూ దేశాయ్ దీపిక పదుకొనే కు స్మృతి కౌంటర్ ‘రాజా సాబ్’ లో సందడి చేసిన మాళవిక! ‘కాంతార’ బీహైండ్ ది సీన్స్ ‘తెలుసుకదా’ రివ్యూ దివ్వెల మాధురికి రీతూ చౌదరి కౌంటర్

Niharika Konidela : ‘మ్యాడ్’ హీరోతో మెగా డాట‌ర్‌ నిహారిక‌ కొత్త సినిమా

Divya Vani M
Niharika Konidela : ‘మ్యాడ్’ హీరోతో మెగా డాట‌ర్‌ నిహారిక‌ కొత్త సినిమా

మెగా డాటర్ నిహారిక కొణిదెల గతేడాది ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో నిర్మాతగా మారిన విషయం తెలిసిందే.తన స్వంత బ్యానర్ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్‌పై రూపొందించిన ఈ సినిమా చిన్న బడ్జెట్‌తో వచ్చినప్పటికీ, రూ. 50 కోట్ల వసూళ్లను రాబట్టి సంచలన విజయాన్ని సాధించింది.ఇప్పుడు నిహారిక రెండో సినిమా ప్రకటించేందుకు సిద్ధమైంది.ఈరోజు అధికారికంగా నిహారిక తన రెండో సినిమా వివరాలను వెల్లడించారు. ఈ చిత్రానికి మానస శర్మ దర్శకత్వం వహించనున్నారు.ఇటీవల మ్యాడ్ మ్యాడ్ స్క్వేర్ చిత్రాలతో ఆకట్టుకున్న యువ కథానాయకుడు సంగీత్ శోభన్ ఇందులో హీరోగా నటించనున్నారు.ముఖ్యంగా ఇది సంగీత్ సోలో హీరోగా చేస్తున్న తొలి చిత్రం కావడం విశేషం. ఇది వరకే నిహారిక పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌లో కొన్ని వెబ్ ప్రాజెక్టులను నిర్మించింది.

Niharika Konidela 'మ్యాడ్' హీరోతో మెగా డాట‌ర్‌ నిహారిక‌ కొత్త సినిమా
Niharika Konidela ‘మ్యాడ్’ హీరోతో మెగా డాట‌ర్‌ నిహారిక‌ కొత్త సినిమా

అందులో హీరోగా సంగీత్ శోభన్, దర్శకురాలిగా మానస శర్మ ఇప్పటికే పని చేశారు.’ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ వెబ్ సిరీస్‌కు మానస శర్మ కథను అందించగా, జీ5లో ప్రసారమైన ఈ ప్రాజెక్ట్‌ మంచి ప్రేక్షకాదరణ పొందింది.అలాగే సోనీ లివ్‌లో వచ్చిన ‘బెంచ్ లైఫ్’ వెబ్ సిరీస్‌ను మానస శర్మ తెరకెక్కించారు.ఇప్పుడు ఈ క్రియేటివ్ కాంబినేషన్ సినిమా రంగంలో అడుగుపెడుతోంది.మానస శర్మ ఈ సినిమాతో ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా పరిచయం కానున్నారు.ఈ కథను మానస శర్మ రాయగా, మహేశ్ ఉప్పల సహాయ కథారచయితగా స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు.మన్యం రమేశ్ ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. నిహారిక తన రెండో సినిమా కోసం ఎంతో కసరత్తు చేసి, మళ్లీ కొత్త టీమ్‌తో ప్రయోగాత్మక కథను అందించనుంది. ఆమె నిర్మాతగా సినిమాకు మంచి ప్రమోషన్ చేస్తూ, ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచేలా పనులను వేగంగా ముందుకు తీసుకెళ్తోంది. మరి ఈ సినిమా కూడా ‘కమిటీ కుర్రోళ్లు’ తరహాలో బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుందా? వేచి చూడాలి!

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870