Harsha Kumar: మాజీ పార్లమెంటు సభ్యులు హర్ష కుమార్ కు ఊహించని షాక్ తగిలింది. మాజీ ఎంపీ హర్ష కుమార్ కు తాజాగా పోలీసులు నోటీసులు జారీ చేశారు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి పై హర్ష కుమార్ అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ తరుణంలోనే హర్ష కుమార్ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. స్వచ్ఛ దారాలు ఉంటే తీసుకొని దర్యాప్తుకు రావాలని రాజమండ్రి నార్త్ జోన్ డిఎస్పి నోటీసులో స్పష్టం చేశారు.

అండర్ సెక్షన్ 194 బీఎన్ఎస్ఎస్ చట్టం కింద పోలీసులు కేసు
రాజానగరం పోలీస్ స్టేషన్ నుంచి క్రైమ్ నెంబర్ 136/2025 పేరుతో నోటీసులు పంపగా.. అండర్ సెక్షన్ 194 బీఎన్ఎస్ఎస్ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ప్రవీణ్ కుమార్ పగడాల మృతిపై హర్షకుమార్ మీ వద్ద ఏమైనా సమాచారం ఇవ్వమని గతంలో ఒకసారి అడిగాం. మరోసారి అడుగుతున్నాం. మీ దగ్గర ఏదైనా ఆధారాలు ఉంటే సీసీ ఫొటోస్ కానీ.. సీసీ ఫుటేజీ వీడియోలు.. ఇంకెమైనా ఆధారాలు ఉంటే రేపు సాయంత్రం 5 గంటలకు రాజానగరం పోలీస్ స్టేషన్ కు రావాలి అని పోలీసులు నోటీసుల్లో పేర్కొన్నారు. అనవసరంగా తప్పుడు ఆరోపణలు చేయకూడదని.. కోరడం జరిగింది.
నేనే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని ప్రశ్నలు
రాజనగరం పోలీసులు ఇచ్చిన నోటీసులకు హర్ష కుమార్ స్పందించారు. మీరు నాకు నోటీసులు ఇవ్వడం కాదు. నేనే రైట్ ఇన్ఫర్మేషన్ యాక్ట్ ప్రకారం కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మీరు నాకు సమాధానాలు ఇవ్వాల్సి వస్తుంది అని హర్ష కుమార్ పోలీసులను ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా గత నాలుగు రోజుల కిందట పాస్టర్ పగడాల ప్రవీణ్ మృతి చెందిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్లే సమయంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనుమానాస్పదంగా మృతి చెందారు. ఇక ఈ సంఘటనను దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.