CM Revanth Reddy leaves for Delhi

CM Revanth Reddy: ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర మంత్రులు, బీసీ వర్గాలకు చెందిన కాంగ్రెస్ శాసనసభ్యులు, ఎంపీల అఖిలపక్ష బృందంతో కలిసి బుధవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద బీసీ సంఘాల ధర్నాలో సీఎం రేవంత్ పాల్గొనున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలుకు ఆమోదముద్ర వేయాలని కాంగ్రెస్ పార్టీ కేంద్రం మీద ఒత్తిడి పెంచే పనిలో పడింది. బీసీ సంఘాల ధర్నాకి రాహుల్ గాంధీ కూడా హాజరుకానున్నారు.

Advertisements
ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్

జంతర్‌మంతర్ వద్ద మహాధర్నా

విద్య, ఉపాధి, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే రెండు బిల్లులకు ఇటీవల తెలంగాణ అసెంబ్లీలో ఆమోదింపజేసుకున్న విషయం తెలిసిందే. అయితే, ఆ బిల్లులను పార్లమెంట్‌ లో ఆమోదించి, షెడ్యూల్-9 లో చేర్చాలని డిమాండ్‌ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద 12 బీసీ సంక్షేమ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు.

ధర్నాకి రాహుల్ గాంధీ కూడా

ఈ క్రమంలోనే నేడు సీఎం రేవంత్ తో పాటు ప‌లువురు కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీకి ప‌య‌న‌మ‌య్యారు. బీసీ సంఘాల ధర్నాకి రాహుల్ గాంధీ కూడా రానున్నారు. ఇక అటు పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, బీర్ల ఐలయ్య, వాకిటి శ్రీహరి, మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, ప్రకాశ్ గౌడ్, ఈర్లపల్లి శంకరయ్య ఢిల్లీ బయలుదేరారు. ఈరోజు ఢిల్లీలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు పెంచుతూ శాసనసభలో చేసిన చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించాలని ధర్నా చేయనున్నారు.

Related Posts
Sudhakar Yadav: జగన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఎస్సై సుధాకర్ – వీడియో వైరల్!
Sudhakar Yadav: జగన్‌కు దిమ్మతిరిగే కౌంటర్ ఇచ్చిన ఎస్సై సుధాకర్ – వీడియో వైరల్!

పోలీసు గౌరవాన్ని కించపరచే వ్యాఖ్యలపై ఎస్సై ధీటైన ప్రతిస్పందన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్సై సుధాకర్ Read more

Satellite : కాచుకొని ఉన్న ‘ఉపగ్రహ’ ముప్పు!
Satellite

భూ కక్ష్యలో మానవ నిర్మిత ఉపగ్రహాల సంఖ్య పెరుగుతున్న తీరుతో పాటు, వాటి చుట్టూ తిరుగుతున్న శకలాల ముప్పు కూడా విపరీతంగా పెరుగుతోంది. ప్రయోగించిన ఉపగ్రహాలు, రాకెట్ Read more

నేటి నుంచి పోలవరం డయాఫ్రమ్ వాల్ నిర్మాణ ప‌నులు
Polavaram diaphragm wall construction works from today

అమరావతి: ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టులో నేడు కీలక ఘట్టం ప్రారంభం కానుంది. నీటి నిల్వకు కీలకమైన డయాఫ్రమ్ వాల్ నిర్మాణ పనులు ఈరోజు నుంచి Read more

వర్మ పై వరుస కేసులు..తప్పించుకోవడం కష్టమే
varma cases

గత వైసీపీ హయాంలో జగన్ అండ చూసుకొని రెచ్చిపోయిన వారు ..ఇప్పుడు బిక్కుబిక్కుమంటున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్..వైసీపీ అధికారంలో ఉన్న టైములో టిడిపి , జనసేన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×