WhatsApp : తప్పుడు ఖాతాల గుర్తింపు : లక్షలాది అకౌంట్లను బ్యాన్ చేసిన వాట్సాప్ ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ మరోసారి సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి నెలలో ఏకంగా 97 లక్షల ఖాతాలను బ్యాన్ చేసింది. నిబంధనలు ఉల్లంఘించిన యూజర్లపై కఠిన చర్యలు తీసుకుంటూ, ప్లాట్‌ఫాం భద్రతను మరింత కట్టుదిట్టం చేసింది.ఈ భారీ చర్యలో 14 లక్షల ఖాతాలను ఫిర్యాదులు అందకముందే తొలగించడం గమనార్హం. వాట్సాప్ అభివృద్ధి చేసిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత వ్యవస్థ అనుమానాస్పద ఖాతాలను గుర్తించి వాటిని నిలిపివేస్తోంది. భారతదేశంలో 50 కోట్లకు పైగా యూజర్లు వాట్సాప్ వాడుతున్నారు. అందులో ఇంత పెద్ద సంఖ్యలో ఖాతాలను బ్యాన్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. అయితే, “యూజర్ల భద్రత మా మొదటి ప్రాధాన్యత” అని వాట్సాప్ అధికారికంగా వెల్లడించింది.

మీ ఖాతా ఎందుకు బ్యాన్ అవుతుంది?
వాట్సాప్ కొన్ని ముఖ్యమైన కారణాల వల్ల ఖాతాలను బ్యాన్ చేస్తోంది. అవేంటంటే…
స్పామ్ మెసేజ్‌లు పంపడం
నకిలీ (ఫేక్) ఖాతాలను సృష్టించడం
థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగించడం
బలవంతంగా గ్రూప్‌లలో చేర్చడం
తప్పుడు సమాచారం వ్యాప్తి చేయడం
ఈ రకాల ప్రవర్తనను ఎవరైనా అనుసరిస్తే, వాట్సాప్ ఖాతాను తొలగించడంలో ఎలాంటి సందేహం లేదు.
వాట్సాప్ అధికారిక ప్రకటన
ఈ విషయంపై స్పందించిన వాట్సాప్ ప్రతినిధి, “యూజర్ల భద్రత కోసం మేము నిరంతరం కృషి చేస్తున్నాం. నిబంధనలను ఉల్లంఘించిన వారిపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటాం. ఎలాంటి అక్రమ కార్యకలాపాలను సహించమని స్పష్టంగా చెబుతున్నాం” అని తెలిపారు.
మీ ఖాతా సురక్షితంగా ఉండాలంటే..?
వాట్సాప్ బ్యాన్ నుంచి తప్పించుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి
వాట్సాప్ నిబంధనలు కచ్చితంగా పాటించాలి
ఎవరినీ వేధించకుండా ఉండాలి
తప్పుడు సమాచారం షేర్ చేయకూడదు
అనుమానాస్పద లింక్స్ క్లిక్ చేయకూడదు
ఒకవేళ పొరపాటున మీ ఖాతా బ్యాన్ అయితే, వాట్సాప్‌కు అప్పీల్ చేసే అవకాశం కూడా ఉంది.వాట్సాప్ తీసుకున్న తాజా నిర్ణయం మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌ను మరింత భద్రంగా మార్చే దిశగా ఉంది. అయితే, తప్పని కారణాల వల్ల ఖాతాలు తొలగించబడుతున్నాయా? లేదా కొంతమంది యూజర్లపై అన్యాయంగా చర్యలు తీసుకుంటున్నారా? అనే అంశంపై ఇప్పటికీ చర్చ కొనసాగుతోంది.