Vande Bharat train to run to Kashmir on April 19

Kashmir : ఏప్రిల్‌ 19న కశ్మీర్‌కు పరుగులు వందేభారత్‌ రైలు

Kashmir : తొలిసారి వందేభారత్‌ రైలు కాశ్మీర్‌లోయలోకి అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఏప్రిల్‌ 19న తొలి వందే భారత్‌ రైలు కాట్రా నుంచి కశ్మీర్‌కు పరుగులు పెట్టనుంది. ఉదంపుర్‌-శ్రీనగర్‌- బారాముల్లా మధ్య 272 కి.మీల మేర ప్రతిష్ఠాత్మకంగా నిర్మించిన రైలు లింక్‌ ప్రాజెక్టు పూర్తయిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ ఈ రైలును ప్రారంభించనున్నారు. ఏప్రిల్‌ 19న ప్రధాని మోడీ ఉదంపుర్‌ వస్తారని.. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనను సందర్శించి ప్రారంభిస్తారని కేంద్రమంత్రి జితేంద్ర సింగ్‌ వెల్లడించారు.

Advertisements
ఏప్రిల్‌ 19న కశ్మీర్‌కు పరుగులు

కొనసాగుతున్న జమ్మూ రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణ పనులు

అనంతరం కాట్రా నుంచి వందేభారత్‌ రైలుకు పచ్చజెండా ఊపి ప్రారంభిస్తారని తెలిపారు. జమ్మూ రైల్వే స్టేషన్‌ పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నందున జమ్మూ- కాట్రా- శ్రీనగర్‌ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ తొలుత కాట్రా నుంచి ప్రారంభం కానుంది. ఈ రైలు లింక్‌ ప్రాజెక్టు గత నెలలోనే పూర్తయిందని.. ట్రయల్‌ రన్‌ కూడా విజయవంతంగా నిర్వహించగా రైల్వే సేఫ్టీ కమిషన్‌ రైలు సర్వీసులు నడిపేందుకు ఆమోదం తెలిపినట్లు అధికారులు వెల్లడించారు. ఈ రైలు ప్రారంభోత్సవంతో కశ్మీర్‌కు ప్రత్యక్ష రైలు అనుసంధానం చేపట్టాలన్న చిరకాల డిమాండ్‌ నెరవేరనట్లవుతుంది.

ఈ ప్రాజెక్టులో మొత్తం 119 కి.మీల పొడువునా 38 సొరంగాలు

కశ్మీర్‌ను రైల్వే సర్వీసులతో అనుసంధానించే ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు 1997లోనే ప్రారంభమైనప్పటికీ.. అనేక భౌగోళిక, వాతావరణ సవాళ్లు, ప్రతికూల పరిస్థితుల కారణంగా జాప్యం చోటుచేసుకుందని అధికారులు తెలిపారు. ఈ ప్రాజెక్టులో మొత్తం 119 కి.మీల పొడువునా 38 సొరంగాలు ఉండగా.. వీటిలో 12.75 కి.మీల మేర నిర్మించిన టీ-49 సొరంగం అత్యంత పొడవైనది. అలాగే, ఈ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టులో 927 వంతెనలు సైతం ఉన్నాయి. వీటిలో చీనాబ్‌ నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన రైల్వే వంతెన కూడా ఉంది. దీని ఎత్తు 359 మీటర్లు.

Related Posts
తెలంగాణ కేబినెట్ భేటీకి ముహుర్తం ఫిక్స్..!
Telangana cabinet meeting has been finalized

హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి మండలి సమావేశానికి తేదీ ఖరారైంది. ఈనెల 23వ తేదీన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయం వేదికగా సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం Read more

నేటితో ముగియనున్న కుంభమేళ పుణ్యస్నానాలు
నేటితో ముగియనున్న కుంభమేళ పుణ్యస్నానాలు

నేడు మహా శివరాత్రి. ఈ పర్వదినం సందర్భంగా దేశవ్యాప్తంగా శైవక్షేత్రాలన్నీ భక్తులతో పోటెత్తుతున్నాయి. కిటకిటలాడుతున్నాయి. అర్ధరాత్రి నుంచే ఆలయాల ముందు బారులు తీరి నిల్చున్నారు భక్తులు. తెల్లవారు Read more

రైతుల ఖాతాల్లో రూ 10 వేలు?
rice paddy3

కొత్త సంవత్సరంలో రైతులకు మేలు చేసేందుకు కేంద్రం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నది. ఇందులో భాగంగా రూ 10 వేలకు పెంపు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధానమంత్రి కిసాన్‌ Read more

మహారాష్ట్రలో బీజేపీ విజయం: ప్రధాని మోదీ విధానాలకు ప్రజల మద్దతు – జెపి నడ్డా
JP Nadda 1

బీజేపీ అధ్యక్షుడు జగత్ ప్రకాష్ నడ్డా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మరియు ఇతర ఉప ఎన్నికల ఫలితాలు ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న విధానాలకు ప్రజల నుండి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×