Will Rahul Gandhi open his mouth yet?: KTR

KTR : ఇప్పటికైనా రాహుల్‌ గాంధీ నోరు విప్పరా?: కేటీఆర్‌

KTR: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఇప్పటికైనా హెచ్‌సీయూ సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల విషయంలో స్పందించాలని బీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌ డిమాండ్ చేశారు. ఈ మేరకు కొన్ని వీడియోలు, ఫొటోలను కేటీఆర్ తన పోస్టుకు జత చేశారు. భూముల వ్యవహారంపై ‘ఎక్స్’ వేదికగా ఆయన స్పందించారు. 400 ఎకరాల విలువైన స్థలాన్ని నాశనం చేస్తూ గ్రీన్ మర్డర్‌కు పాల్పడుతున్నారు. ఆ స్థలంలో బుల్డోజర్లు, జేసీబీలు తిరుగుతున్నాయి. వాటిని చూసి అక్కడి నెమళ్లు సాయం కోసం చూస్తున్నాయి. ఇప్పటికైనా రాహుల్‌ గాంధీ నోరు విప్పరా?ఇవన్నీ చూస్తూ కూడా ఆయన మాట్లాడకపోతే ఎలా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

Advertisements
ఇప్పటికైనా రాహుల్‌ గాంధీ నోరు

ప్రభుత్వ స్వాధీనంలో 400ఎక‌రాల భూమి

కాగా, టీజీఐఐసీ కంచ గచ్చిబౌలి భూములపై కీలక ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూమి లేదని తెలిపింది. ఈ మేరకు టీజీఐఐసీ ప్రకటన విడుదల చేసింది. 400ఎక‌రాల భూమి ప్రభుత్వ స్వాధీనంలో ఉంది. అటవీ భూమి అంటూ త‌ప్పుడు ప్రచారం జరుగుతోంది. 400 ఎకరాలు రెవెన్యూ రికార్డుల్లోనూ ప్రభుత్వ భూమిగానే ఉంది. దీనిలో బఫెల్లో లేక్‌, పీకాక్ లేక్ లేవు. ప్రపంచ‌స్థాయి ఐటీ మౌలిక వ‌స‌తులు, అనుసంధానత పెంపు, త‌గినంత ప‌ట్టణ స్థలాల ల‌భ్యత అనే ప్రభుత్వ ప్రాధాన్యానికి ప్రస్తుత ప్రాజెక్టు క‌ట్టుబ‌డి ఉంది అని టీజీఐఐసీ పేర్కొంది.

Related Posts
భారతదేశానికి రాకుండానే వీసాలను రెన్యూ చేసుకోవొచ్చు!
భారతదేశానికి రాకుండానే వీసాలను రెన్యూ చేసుకోవొచ్చు!

అమెరికా విదేశాంగ శాఖ యునైటెడ్ స్టేట్స్లో హెచ్-1బీ వీసాలను పునరుద్ధరించడానికి పైలట్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసింది. ఈ సంవత్సరం, అమెరికాలోనే వీసా పునరుద్ధరణ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి Read more

ఏపీకి ‘దానా’ తుఫాను ముప్పు
AP Cyclone Dana

బంగాళాఖాతంలో 'దానా' తుఫాను ముప్పు పొంచి ఉండటంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశా, బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలకు IMD హెచ్చరికలు జారీ చేసింది. వాయుగుండం ఇవాళ తుఫానుగా, రేపు తీవ్ర Read more

కేసీఆర్ చిత్ర‌ప‌టానికి కేటీఆర్ పాలాభిషేకం
ktr kcr

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌ ఆమరణ నిరాహార దీక్షకు దిగి నేటితో 15 ఏళ్లు పూర్తయిన సందర్భంగా బీఆర్‌ఎస్‌ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా Read more

అమెరికాలో భారీ తుఫాను: 7 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి
అమెరికాలో భారీ తుఫాను: 7 రాష్ట్రాల్లో అత్యవసర పరిస్థితి

అమెరికా మధ్య ప్రాంతాలను శీతాకాల తుఫాను భారీగా తాకింది. ఈ తుఫాను దశాబ్ద కాలంలోనే అత్యంత తీవ్రమైన హిమపాతాన్ని కలిగించింది. దీంతో 60 మిలియన్లకు పైగా ప్రజలు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×