He is my monday motivation.. Anand Mahindra

Anand Mahindra: నా మండే మోటివేషన్‌ ఆయనే : ఆనంద్‌ మహీంద్రా

Anand Mahindra: ప్రముఖ పారిశ్రామికవేత్త ఆనంద్‌ మహీంద్రా ఈరోజు కూడా ఆయన ఓ మండే మోటివేషన్‌ను షేర్‌ చేశారు. ఈ సందర్భంగా ఆయన యువ ఐఏఎస్‌ అధికారి డి.కృష్ణ భాస్కర్‌ కథనాన్ని పంచుకున్న ఆయన ఆ అధికారి నుంచి ఎంతో స్ఫూర్తి పొందుతున్నట్లు తెలిపారు. వ్యవసాయ రంగం గురించి మనకు ఎంతో కొంత అవగాహన ఉంటుంది. భూగర్భ జలాల స్థాయిలను పెంచడంలో దేశం ఎలాంటి సవాళ్లను ఎదుర్కొంటుందో మన అందరికీ బాగా తెలుసు. అలాంటి సమయంలో ఈ యువ ఐఏఎస్‌ అధికారి కృష్ణభాస్కర్‌ సాధించిన విజయాన్ని ఎంత ప్రశంసించినా తక్కువే. సమస్య ఎలాంటిదైనా దాన్ని అధిగమించగలమని ఆయన మనలో విశ్వాసాన్ని నింపగలిగారు. దానికి కావాల్సిందల్లా దృఢ సంకల్పమే అని రుజువు చేశారు. అందుకే ఆయనే నా మండే మోటివేషన్‌ అని మహీంద్రా ప్రశంసలు కురిపించారు.

Advertisements
నామండే మోటివేషన్‌ ఆయనే  ఆనంద్‌

కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అద్భుత విజయాలు

తెలంగాణకు చెందిన ఐఏఎస్‌ అధికారి దేవరకొండ కృష్ణ భాస్కర్‌ రాజన్న సిరిసిల్లా జిల్లాకు కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అద్భుత విజయాలు సాధించారు. నీటి కొరతను అధిగమించేందుకు పలు చర్యలు చేపట్టారు. పైపుల ద్వారా నీటి సరఫరా, రిజర్వాయర్లకు భూమి సేకరణ, నీటి వనరుల కోసం పూడికతీత వంటి చర్యలతో నీటి నిల్వల సామర్థ్యాన్ని పెంచారు. నీటి లభ్యతను విస్తృతంగా పెంచడం కోసం రిజర్వాయర్ల సమీపంలో చిన్న ట్యాంకులను ఏర్పాటుచేశారు. ఆయన చర్యలతో నాలుగేళ్లలోనే భూగర్భ జలాల స్థాయిలను ఆరు మీటర్ల మేర పెంచగలిగారు. ఆయనకు సంబంధించి ఓ స్ఫూర్తిదాయక కథనాన్ని గతేడాది జూన్‌లో బెటర్‌ ఇండియా పేజీ పంచుకుంది. ఆ పోస్ట్‌నే తాజాగా ఆనంద్‌ మహీంద్రా షేర్‌ చేస్తూ ఈ యువ అధికారిపై ప్రశంసలు కురిపించారు. కృష్ణకుమార్‌ సేవలకు గానూ 2019, 2020లో వరుసగా రెండుసార్లు ప్రజా పాలనలో ప్రధానమంత్రి అత్యుత్తమ అవార్డును అందుకున్నారు.

Related Posts
క్లాస్ రూమ్‌లో స్టూడెంట్‌ను పెళ్లాడిన మహిళా ప్రొఫెసర్!
professor

తరగతి గదిలోనే స్టూడెంట్‌ను ఓ మహిళా ప్రొఫెసర్ వివాహం చేసుకుంటున్న వీడియో ఒకటి కలకలం రేపుతోంది. విస్మయానికి గురిచేసే ఈ ఘటన పశ్చిమ్ బెంగాల్‌లోని నాడియా జిల్లా Read more

Nagpur: నాగ్ పూర్ లో చెలరేగుతున్న అల్లర్లు
Nagpur: నాగ్ పూర్ లో అల్లర్లు.. వీహెచ్‌పీ ర్యాలీపై రాళ్లదాడి

మహారాష్ట్రలోని ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో ఉన్న ఔరంగజేబ్ సమాధిని తొలగించాలంటూ హిందూ సంఘాలు చేపట్టిన నిరసనలు తీవ్రమయ్యాయి. ఈ ఆందోళనలు సోమవారం నాగ్ పూర్‌లో ఉద్రిక్తతకు దారి Read more

KTR: సన్నబియ్యం కోసం చూస్తే దొడ్డుబియ్యం కూడా ఇయ్యలే : కేటీఆర్‌
ktr comments on congress

KTR : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మరోసారి కాంగ్రెస్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రజాపాలన అంటే పస్తులేనా అని, ఇందిరమ్మ రాజ్యం అంటే రేషన్ బియ్యం Read more

రన్యా రావు మూడు రోజుల కస్టడీకి అనుమతి
రన్యా రావు మూడు రోజుల కస్టడీకి అనుమతి

బెంగళూరు గోల్డ్ స్మగ్లింగ్ కేసు: నటి రన్యా రావు సంచలన కథ బెంగళూరులో గోల్డ్ స్మగ్లింగ్‌ కేసులో నటి రన్యా రావు చిక్కింది. ఈ కేసు నేటి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×