Betting apps case.. SIT formed with five members

Betting apps: బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారం.. ఐదుగురితో సిట్‌ ఏర్పాటు

Betting apps: తెలంగాణ ప్రభుత్వం బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారం పై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసింది. ఈ మేరకు డీజీపీ జితేందర్‌ ఆదేశాలు జారీ చేశారు. సీఐడీ అదనపు డీజీ పర్యవేక్షణలో సిట్‌ దర్యాప్తు చేపట్టనుంది. సిట్‌ బృందంలో ఐజీ రమేశ్‌తో పాటు ఎస్పీలు సింధు శర్మ, వెంకటలక్ష్మి, అదనపు ఎస్పీ చంద్రకాంత్‌, డీఎస్పీ శంకర్‌ ఉన్నారు. బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారంపై ఇప్పటికే పంజాగుట్టతో పాటు సైబరాబాద్‌, మియాపూర్‌ పీఎస్‌లలో కేసులు నమోదయ్యాయి.

Advertisements
బెట్టింగ్‌ యాప్స్‌ వ్యవహారం ఐదుగురితో

ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సైతం కీలకపాత్ర

ఈ కేసులను కూడా ప్రభుత్వం సిట్‌కు బదిలీ చేసింది. దీనిపై 90 రోజుల్లో పూర్తిస్థాయి నివేదిక అందజేయాలని సిట్‌కు డీజీపీ ఆదేశాలు జారీ చేశారు. కాగా, ప్రత్యేక దర్యాప్తు బృందంలో (సిట్‌) సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ సైతం కీలకపాత్ర పోషించనున్నారని తెలుస్తోంది. సిట్‌ ఏర్పాటుపై బుధవారం అసెంబ్లీలో ప్రకటన చేయడానికి ముందు సీఎం రేవంత్‌రెడ్డి ఓ కీలక సమావేశం నిర్వహించారు.

మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌పై పోరు

శాసనసభ ప్రాంగణంలోని ఆయన కార్యాలయంలో జరిగిన ఈ సమావేశానికి డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్‌ డీజీ శివధర్‌రెడ్డి, నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్, సైబర్‌ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్‌ శిఖాగోయల్‌లతోపాటు సజ్జనార్‌ సైతం పాల్గొన్నారు. సజ్జనార్‌ సీఐడీ ఎస్పీగా ఉన్నప్పుడు మల్టీ లెవల్‌ మార్కెటింగ్‌పై పోరు ప్రకటించారు. వివిధ సంస్థల కార్యకలాపాలను బహిర్గతం చేయడంతో పాటు ప్రత్యేక చట్టం రావడానికీ కారణమయ్యారు.

Related Posts
సింగ‌పూర్ లో తెలంగాణ కల్చ‌ర‌ల్ మీట్ లో సీఎం రేవంత్
CM Revanth at Telangana Cul

సింగపూర్ పర్యటనలో ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, అక్కడి తెలంగాణ కల్చరల్ సొసైటీ నిర్వహించిన మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమావేశం సింగపూర్ Read more

తిరుపతిలో ‘ఆరోగ్య యోగ యాత్ర’
'Arogya Yoga Yatra' in Tirupati

తిరుపతి : దాదాపు 46,000 మందికి పైగా ప్రసూతి మరియు గైనకాలజీ నిపుణులకు ప్రాతినిధ్యం వహిస్తున్న, భారతదేశంలోని అతిపెద్ద ప్రొఫెషనల్ సంస్థ అయిన ఫెడరేషన్ ఆఫ్ అబ్స్టెట్రిక్ Read more

ఎమ్మెల్యే కూనంనేనికి సుప్రీంకోర్టులో చుక్కెదురు!
mla kunamneni sambasiva rao

కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుకు సుప్రీంకోర్టులో షాక్ తగిలింది. గత ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారికి తన భార్య పేరు ప్రకటించలేదన్న కారణంగా హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై కూనంనేని Read more

ఇందిరాపార్క్ కు ఆటోలో ప్రయాణించిన కేటీఆర్‌
KTR traveled by auto to Indira Park

హైదరాబాద్‌: బీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్ ఆటలో ప్రయాణించారు. ఈరోజు ఉదయం నుండి హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్ వద్ద ఆటో డ్రైవర్ల మహా ధర్నా కొనసాగుతోంది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×