ChatGPT చాట్ జీపీటీతో ఓపెన్ ఏఐ సరికొత్త ఫీచర్ తో టెక్ రంగంలో సందడి

ChatGPT : చాట్ జీపీటీతో ఓపెన్ ఏఐ సరికొత్త ఫీచర్ తో టెక్ రంగంలో సందడి

ChatGPT : చాట్ జీపీటీతో ఓపెన్ ఏఐ సరికొత్త ఫీచర్ తో టెక్ రంగంలో సందడి చాట్ జీపీటీతో సంచలనం సృష్టించిన ఓపెన్ ఏఐ సరికొత్త ఫీచర్ తో టెక్ రంగంలో సందడి చేస్తోంది. రాజకీయ నేతలు సైతం ఈ ట్రెండ్ ను ఫాలో అవుతున్నారు. ఘిబ్లీ శైలి చిత్రాలను సృష్టించే సామర్థ్యంతో కూడిన GPT-4o అనే టూల్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది. అయితే, అధిక డిమాండ్ కారణంగా ఈ ఫీచర్ ప్రస్తుతం సబ్‌స్క్రిప్షన్ రుసుం చెల్లించిన వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నేపథ్యంలో, ఉచితంగా కూడా ఘిబ్లీ స్టయిల్ ఇమేజ్ లను రూపొందించడానికి ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి. జెమిని, గ్రోక్ AI మోడల్స్ వంటి ఉచిత టూల్స్ లేదా ప్రీమియం AI ప్లాట్‌ఫారమ్‌లపై ఉచిత ట్రయల్స్‌ను ఉపయోగించి మీ స్వంత ఘిబ్లీ-శైలి చిత్రాలను రూపొందించుకోవచ్చు.

Advertisements
ChatGPT చాట్ జీపీటీతో ఓపెన్ ఏఐ సరికొత్త ఫీచర్ తో టెక్ రంగంలో సందడి
ChatGPT చాట్ జీపీటీతో ఓపెన్ ఏఐ సరికొత్త ఫీచర్ తో టెక్ రంగంలో సందడి

చాట్‌ జీపీటీ రూపకర్త ఓపెన్ఏఐ యొక్క తాజా GPT-4o అప్‌డేట్‌తో, స్టూడియో ఘిబ్లీ శైలి చిత్రాల ట్రెండ్ వైరల్ అవుతోంది.మార్చి 25న విడుదలైన ఈ ఫీచర్ ప్రస్తుతం చాట్‌ జీపీటీ ప్లస్, ప్రో, టీమ్ మరియు సెలెక్ట్ సబ్‌స్క్రిప్షన్ స్థాయిలకు మాత్రమే పరిమితం చేయబడింది. ఓపెన్ ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్ తెలిపిన ప్రకారం, అధిక డిమాండ్ కారణంగా ఉచిత వినియోగదారులకు ఈ ఫీచర్ విడుదల ఆలస్యవుతోంది. అయితే, పలు టెక్ ప్లాట్ ఫాంలు ఘిబ్లీ ఫీచర్ ను ఉచితంగా అందిస్తున్నాయి.జెమిని లేదా గ్రోక్ వంటి AI మోడల్స్ స్టూడియో ఘిబ్లీ శైలి విజువల్స్‌ను సృష్టించగలవు. వివిధ ప్రాంప్ట్‌లను ఉపయోగించి మనకు కావాల్సిన ఘిబ్లీ స్టయిల్ ఇమేజ్ లను పొందవచ్చు.

అయితే అల్గారిథమ్‌లలోని వ్యత్యాసాల కారణంగా ఈ ఘిబ్లీ ఇమేజ్ లు చాట్‌ జీపీటీ GPT-4o క్రియేషన్స్‌కు భిన్నంగా ఉండవచ్చు.చాట్‌ జీపీటీ చిత్రాలు ఫోటోరియలిస్టిక్ నైపుణ్యంతో ఉండగా… జెమిని, గ్రోక్ లేదా ట్రయల్-బేస్డ్ ప్లాట్‌ఫాంల ద్వారా రూపొందించే ఘిబ్లీ ఇమేజ్ లు కాస్త భిన్నంగా ఉంటాయి.చాట్‌ జీపీటీ సబ్‌స్క్రిప్షన్ లేకుండానే మీ ఫోటోలను లేదా ఆలోచనలను స్టూడియో ఘిబ్లీ ఆర్ట్ గా మార్చవచ్చు. క్రేయాన్, డీప్‌ఏఐ మరియు ప్లేగ్రౌండ్ ఏఐ వంటి ఉచిత ప్లాట్‌ఫాంలు వివిధ స్థాయిల్లో ఏఐ ఇమేజ్ జనరేషన్‌ను అందిస్తాయి. అందుకోసం వివిధ ప్రాంప్ట్ లను ఉపయోగిస్తే సరిపోతుంది.రన్‌వే ML, లియోనార్డో AI లేదా మేజ్.స్పేస్ వంటి ప్లాట్‌ఫారమ్‌లు చాట్‌ జీపీటీ తరహా సామర్థ్యాలను కలిగి ఉంటాయి. ఇవి ఉచిత ట్రయల్స్‌ను అందిస్తాయి. సైన్ అప్ చేశాక, మీ చిత్రాన్ని అప్‌లోడ్ చేస్తే చాలు… ఘిబ్లీ సిగ్నేచర్ లుక్‌ను అనుకరించడానికి ప్రాంప్ట్‌లను ఉపయోగించాల్సి ఉంటుంది.

Related Posts
China : 4 నెలల్లో 85,000 వీసాలు జారీ చేసింది, వాణిజ్య యుద్ధం వేళ
china

china : ప్రస్తుతం అమెరికాతో వాణిజ్య యుద్ధం చేస్తున్నప్పటికీ, ఇప్పుడు భారతదేశానికి తన స్నేహ హస్తం చాస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చైనా ఉత్పత్తులపై సుంకాలను Read more

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్‌
Former MLA Vallabhaneni Vamsi arrested

కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసినట్టు కేసు నమోదు.. అమరావతి: వైసీపీ కీలక నేత , గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పోలీసులు హైదరాబాద్‌లో Read more

బిహార్ లో మఖానా బోర్డు.. దాని గురించి తెలుసా?
Makhana Board

బిహార్ రాష్ట్రంలో మఖానా బోర్డు ఏర్పాటు చేయబడుతుందని కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్ తాజా బడ్జెట్‌లో ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత మఖానా గురించి అందరి ఆసక్తి Read more

Pakistan: పాకిస్థాన్ మసీదులో బాంబు పేలుడు
Bomb blast in Pakistan mosque

Pakistan : బలూచిస్తాన్ ట్రైన్ హైజాక్, తాలిబాన్ల వరుస దాడులతో పాకిస్తాన్ దద్ధరిల్లుతోంది. నిన్ననే హైజాక్ భాగోతం పూర్తయింది. ఈ రోజు అక్కడ మసీదు మరోసారి బాంబు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

×