విద్యుత్ షాక్‌

Medak District : దేవాలయంలో విద్యుత్ షాక్‌ తో వ్యక్తి మరణం

మెదక్ జిల్లా రామాయంపేట మండల పరిధిలోని కోనాపూర్ గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని హనుమాన్ దేవాలయం వద్ద శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటల ప్రాంతంలో దేవాలయాన్ని క్లీన్ చేస్తుండగా, పక్కన ఉన్న స్తంభం యొక్క సపోర్ట్ వైర్ తగిలి గ్రామానికి చెందిన కిచ్చయ్య గారి మాధవరెడ్డి (73) విద్యుత్ షాక్‌ తగిలి మృత్యువాత పడ్డాడు.

మృతుడు మాధవరెడ్డి

మృతుడు మాధవరెడ్డి అతని భార్య భారతమ్మ. ప్రతిరోజు దేవాలయాన్ని శుభ్రం చేస్తుంటారు. సుమారు 15 సంవత్సరాలుగా ఇద్దరు దంపతులు హనుమాన్ దేవాలయానికి సేవ చేస్తూ జీవనం గడుపుతుంటారు.

భార్య భారతమ్మ రోదనలు

ఈరోజు ప్రమాదవశాత్తు ఇలా మాధవరెడ్డి మృత్యువాత పడడంతో భార్య భారతమ్మ రోదనలు మిన్నంటాయి.

కుటుంబ సభ్యులు

ఈ దంపతులకు ఇద్దరు కొడుకులు ఉన్నారు. వారు జీవనోపాధి నిమిత్తం హైదరాబాదులో ఉంటారు.

ఉగాది పర్వదినంలో విషాదం

ఉగాది పర్వదినాన గ్రామంలో ఇలా దేవాలయం ఆవరణలో వ్యక్తి మృతి చెందడంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Related Posts
పట్నం నరేందర్‌ రెడ్డికి హైకోర్టులో ఊరట
patnam narender reddy

బీఆర్ఎస్ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కి హైకోర్టులో ఊరట లభించింది. బోంరాస్‌పేట పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఓ కేసులో రాష్ట్ర ఉన్నత Read more

మరో సారి హైదరాబాద్‌లో ఐటీ సోదాలు..
IT searches in Hyderabad again

హైదరాబాద్ : ఐటీ అధికారుల సోదాలు హైదరాబాద్ లో మరో సారి కలకలం రేపుతున్నాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారాలే లక్ష్యంగా మరో సారి ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. Read more

Telangana : 6729 మంది ఉద్యోగులను తొలగించిన రేవంత్ రెడ్డి సర్కార్ ?
Revanth Reddy government dismissed 6729 employees?

Telangana : ఒకే ఆర్డర్ తో 6,729 మంది పైన రేవంత్ సర్కార్ వేటు వేసింది. ప్రభుత్వంలో పలు శాఖల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న పదవీ Read more

తెలంగాణ మందుబాబులకు షాకింగ్ వార్త..?
liquor sales in telangana jpg

తెలంగాణ మందుబాబుల జేబులకు చిల్లు పడే వార్త. త్వరలో మద్యం ధరలు భారీగా పెంచేందుకు సర్కార్ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తుంది. పక్క రాష్ట్రాల్లో ఉన్న రేట్లకు అనుగుణంగా Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *