Telangana government gives good news to Muslims

Ramadan Festival: ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ ప్రభుత్వం

Ramadan Festival: తెలంగాణ ప్రభుత్వం రంజాన్ పండుగ వేళ శుభవార్తను ప్రకటించింది. ముస్లింల పవిత్ర పండుగ అయిన రంజాన్ నేపథ్యంగా వరుసగా రెండు రోజులు సెలవులు ప్రకటించింది. తెలంగాణ ప్రభుత్వ పని దినాల ప్రకారం మార్చి 31వ తేదీన ఈదుల్ ఫితర్ (రంజాన్) పండుగను జరుపుకోనున్నారు. ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కళాశాలలు, ఆఫీస్‌లకు సెలవు ఉండనుండగా తర్వాత రోజు అంటే ఏప్రిల్ 1వ తేదీన కూడా సెలవు ప్రకటించింది. గత ప్రభుత్వం అధికారంలోకి ఉన్న సమయంలో బోనాల పండుగ తర్వాతి రోజు, క్రిస్మస్ పండుగ తర్వాతి రోజు, రంజాన్ పండుగ తర్వాతి రోజు సెలవులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తోంది.

ముస్లింలకు గుడ్ న్యూస్ చెప్పిన తెలంగాణ

ఆప్షనల్ హాలిడేను ప్రభుత్వం

ప్రస్తుత ప్రభుత్వం కూడా దానినే కొనసాగిస్తూ ముందుకు వెళ్తోంది. ఏపీలో మాత్రం మార్చి 31వ తేదీన ఒక్కరోజే సెలవు ఉండనుంది. ఇక రేపు (మార్చి 28) జమాతుల్-విదా సందర్భంగా ఆప్షనల్ హాలిడేను ప్రభుత్వం ప్రకటించింది. మిగతా కాలేజీలు, స్కూళ్లు యథావిధిగా పని చేయనున్నాయి. రేపు ముస్లిం మైనారిటీ ఇంజనీరింగ్ కాలేజీలు, ఇంటర్మీడియట్ కళాశాలలకు సెలవు ప్రకటిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. హైదరాబాద్‌లోని పాతబస్తీ ప్రాంతంతో పాటు ముస్లింలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ఈ సెలవు ప్రభావం ఉంటుంది. వరుస పండగల నేపథ్యంలో వరుస సెలవులు రావడంతో విద్యాసంస్థలు ఏప్రిల్ 2న బుధవారం తిరిగి ప్రారంభం కానున్నాయి.

మైనార్టీ విద్యా సంస్థలకు వరుస సెలవులు

రేపటి నుంచి ఒక్క శనివారం(మార్చి 29) మినహా బుధవారం మైనార్టీ విద్యా సంస్థలకు వరుస సెలవులు వచ్చాయి. మిగతా వారికి మార్చి 30 ఉగాదితోపాటు.. ఆదివారం కావడం, తర్వాతి రోజు రంజాన్, ఆ తర్వాతి రోజు ఏప్రిల్ 1న కూడా ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో.. వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. ఈ వీకెండ్ ఎంజాయ్ చేయడానికి విద్యార్థులకే కాదు.. ప్రైవేట్, ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి కూడా అవకాశం ఏర్పడింది.

Related Posts
Amaravati ORR: 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్
Amaravati ORR 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్

Amaravati ORR: 121 గ్రామాల మీదుగా అమరావతి ఓఆర్ఆర్ ఏపీ ప్రభుత్వం భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా మార్చేందుకు సీఎం చంద్రబాబు Read more

తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ విద్య
AI Study

తెలంగాణ ప్రభుత్వ స్కూళ్లలో ఏఐ విద్య.తెలంగాణ రాష్ట్రంలో విద్యా ప్రమాణాలను పెంపొందించేందుకు ప్రభుత్వం కొత్త ప్రయోగాలను ప్రారంభిస్తోంది. విద్యార్థుల పఠన సామర్థ్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో, ప్రభుత్వ పాఠశాలల్లో Read more

మహదేవ్‌ శాస్త్రిగా మోహన్‌ బాబు
mohan babu kannappa

కన్నప్ప 2024లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఏవీఏ ఎంటర్‌టైన్‌మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్‌లపై డాక్టర్‌ మోహన్‌బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకు ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం Read more

ప్రపంచంలోనే అత్యధిక వయస్కుడు మృతి
world oldest man john alfre

ప్రపంచంలో అత్యధిక వయసుగల వ్యక్తిగా పేరొందిన జాన్ టిన్నిస్వుడ్ కన్నుమూశారు. ఆయన వయసు 112 ఏళ్లు. సౌత్ పోర్టులోని కేర్ సెంటర్‌లో చికిత్స పొందుతూ జాన్ మృతిచెందినట్లు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *