అమెరికాలో ఆటోమోటివ్ వాహనాలపై భారీగా పన్ను

Trump: విదేశీ వాహనాలపై 25 శాతం సుంకం.. ట్రంప్‌ వెల్లడి

Trump: విదేశాల్లో తయారై యూఎస్‌లో దిగుమతయ్యే కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఇది ఏప్రిల్‌ 2 నుంచి అమల్లోకి వస్తోందని స్పష్టంచేశారు. బుధవారం వైట్‌హౌస్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. అమెరికాలో తయారుచేయని అన్ని కార్లపై 25 శాతం సుంకం విధిస్తున్నాం. ఈ చర్య శాశ్వతంగా ఉంటుంది. ఇక్కడ తయారయ్యే వాటిపై మాత్రం ఎలాంటి సుంకం ఉండదు. ఈ చర్య మా ఆర్థికవృద్ధిని పెంచుతోంది. మునుపెన్నడూ చూడని వృద్ధిని కొనసాగిస్తుంది. ఏప్రిల్‌ 2 నుంచి ఇవి అమల్లోకి వస్తాయి అని ట్రంప్‌ పేర్కొన్నారు. మొదట చైనా దిగుమతులపై ట్రంప్‌ 10 శాతం సుంకం విధించగా తర్వాత దాన్ని 20 శాతానికి పెంచారు. ఈ టారిఫ్‌ల విషయంలో ఆ దేశానికి ట్రంప్‌ ఓ ఆఫర్‌ను ప్రకటించారు.

విదేశీ వాహనాలపై 25 శాతం సుంకం

అవసరమైతే ఒప్పంద గడువును కూడా పెంచుతా

ప్రముఖ షార్ట్‌ వీడియో యాప్‌ టిక్‌టాక్‌ ను విక్రయిస్తే.. టారిఫ్‌లు తగ్గించే అవకాశం ఉందన్నారు. అవసరమైతే ఒప్పంద గడువును కూడా పెంచుతానన్నారు. వైట్‌హౌస్‌లో విలేకరులతో మాట్లాడినప్పుడు ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల టిక్‌టాక్‌ను నిషేధిస్తున్నట్లు అమెరికా ప్రకటించిన సంగతి తెలిసిందే. యూఎస్‌ నిబంధనలకు కట్టుబడనందున జనవరి 18న ఆ యాప్‌ను ప్లే స్టోర్ల నుంచి గూగుల్ , యాపిల్‌ తొలగించాయి. దీని నిషేధాన్ని అమలుచేయడంలో అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆలస్యం చేయడంతో అమెరికాలోని ఆపిల్, గూగుల్ యాప్ స్టోర్‌లలో టిక్‌టాక్‌ మళ్లీ ప్రత్యక్షమయ్యింది. ఈ యాప్‌కు అమెరికాలో 170 మిలియన్ల మంది యూజర్లు ఉన్నారు. ఈ యాప్‌ కొనుగోలు గురించి ఇటీవల అనేక వార్తలు వచ్చాయి. తొలుత ప్రపంచ కుబేరుడు ఎలాన్‌మస్క్‌ దీన్ని కొనుగోలు చేస్తున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, ఆయన దాన్ని ఖండించారు. ‘సావరిన్‌ వెల్త్‌ఫండ్‌’ ను సృష్టించాలని అమెరికా ట్రెజరీ, వాణిజ్య విభాగాలను ట్రంప్‌ ఇటీవల ఆదేశిస్తూ.. కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు.

Related Posts
పార్టీ మారిన ఎమ్మెల్యేలపై హైకోర్టు కీలక తీర్పు
IAS officers did not get relief in the high court

హైదరాబాద్‌: పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఈరోజు తెలంగాణ హైకోర్టు విచారణ చేసింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేల అనర్హతపై తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని Read more

రైతులకు శుభవార్త తెలిపిన RBI
RBI gives good news to farm

రైతులకు కేంద్ర బ్యాంక్ అయిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) శుభవార్త అందించింది. చిన్న, సన్నకారు రైతులకు ఉపయోగపడే వ్యవసాయ రుణాల పరిమితిని 1.6 లక్షల Read more

గ్రామస్థాయి ఉద్యోగులకు సీఎం రేవంత్ గుడ్ న్యూస్
cm revanth ryathu sabha

తెలంగాణలో గ్రామస్థాయి ఉద్యోగులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ తెలిపారు. జీతాలు క్రమం తప్పకుండా చెల్లించేందుకు అధికారులను ఆయన ఆదేశించారు. గ్రీన్ ఛానల్ ద్వారా ఎప్పటికప్పుడు Read more

రస్మికపై మండి ఎంఎల్ఏ ఆగ్రహం
రస్మికపై మండి ఎంఎల్ఏ ఆగ్రహం

కర్ణాటక కాంగ్రెస్ నేతలు రష్మిక మందన్నపై తీవ్రమైన విమర్శలు చేయగా ఆమె పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. రష్మికను ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు ఆహ్వానించినప్పటికీ ఆమె హాజరుకాకపోవడమే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *