UPI services disrupted across the country

UPI Down: దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం

UPI Down: దేశవ్యాప్తంగా డిజిటల్‌ చెల్లింపుల వ్యవస్థ యూపీఐ (UPI) సేవల్లో అంతరాయం ఏర్పడింది. ఈ సేవల్లో సాంకేతిక లోపం తలెత్తింది. పేమెంట్స్‌, ఫండ్‌ ట్రాన్స్‌ఫర్‌ వంటి విషయాల్లో అవాంతరాలు ఎదుర్కొంటున్నట్లు యూజర్లు పేర్కొంటున్నారు. డౌన్‌ డిటెక్టర్‌ వెబ్‌సైట్‌ ప్రకారం.. బుధవారం సాయంత్రం 7 గంటల తర్వాత ఈ సమస్య ఉత్పన్నమైనట్లు సమాచారం. ఈ మేరకు యూజర్లు సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్నారు. యూపీఐ సేవలందించే గూగుల్ పే, ఫోన్‌పే వంటి యాప్స్‌ పనిచేయడం లేదని పేర్కొంటున్నారు. దీంతో ఈ అంశంపై నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (NPCI) స్పందించింది. యూపీఐ సేవల్లో అంతరాయం ఏర్పడిన విషయాన్ని ధ్రువీకరించింది. సాంకేతిక సమస్యల కారణంగా యూపీఐ సేవలపై తాత్కాలికంగా ప్రభావం పడినట్లు తెలిపింది. ఇప్పుడు సమస్య పరిష్కారమైందని, వినియోగదారులకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తున్నట్లు ‘ఎక్స్‌’ వేదికగా పేర్కొంది.

దేశవ్యాప్తంగా యూపీఐ సేవల్లో అంతరాయం

ప్రజలు దాదాపు 90 శాతం చెల్లింపులు పేమెంట్‌ యాప్స్‌ ద్వారానే

కాగా, కొవిడ్‌ సమయంలో పెరగడం మొదలైన యూపీఐ చెల్లింపులు ఆ తర్వాత కాలంలో బాగా ఊపందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మెజారిటీ ప్రాంతాల్లో ప్రజలు దాదాపు 90 శాతం చెల్లింపులు పేమెంట్‌ యాప్స్‌ ద్వారానే చేస్తున్నారు. అంతటి కీలకమైన యూపీఐ సేవలకు అంతరాయం.. అందునా వ్యాపారాలు జోరుగా సాగే సాయంత్రం సమయంలో కలగడంతో.. హోటళ్లు, కిరాణాషాపులు, షాపింగ్‌ మాల్స్‌, చిరువ్యాపారులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. ఈ సమస్యపై సామాజిక మాధ్యమాల ద్వారా పెద్ద ఎత్తున ఫిర్యాదులు చేశారు. దీంతో ఎక్స్‌లో ‘యూపీఐడౌన్‌’ అనే హ్యాష్‌ ట్యాగ్‌ వైరల్‌ అయ్యింది. ఔటేజ్‌ ట్రాకింగ్‌ వెబ్‌సైట్‌ డౌన్‌డిటెక్టర్‌ ప్రకారం రాత్రి 7.40 గంటల సమయంలో ఫిర్యాదులు వెల్లువెత్తాయి.

Related Posts
అమెరికాలో భారతీయులను వెంటాడుతున్న సెల్ఫ్ డిపోర్టేషన్ భయం
అమెరికాలో భారతీయులను వెంటాడుతున్న సెల్ఫ్ డిపోర్టేషన్ భయం

అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ రావడంతో భారతీయులకు కష్టాలు మొదలయ్యాయి. H4 వీసా కింద ఉన్న వేలాది మందికి కొత్త టెన్షన్ హెచ్ వన్ బి వీసా హోల్డర్లు Read more

ఎన్నికల కమిషన్‌కి కేజ్రీవాల్ విజ్ఞప్తి
ఎన్నికల కమిషన్‌కి కేజ్రీవాల్ విజ్ఞప్తి

ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ గురువారం ఎన్నికల కమిషన్ సీనియర్ అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా, తన న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గ ప్రత్యర్థి, Read more

సూడాన్‌లో విమాన ప్రమాదం – 46కి చేరిన మరణాలు
Plane crash in Sudan2

సూడాన్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో మరణాల సంఖ్య 46కి చేరింది. అధికారిక వర్గాల సమాచారం మేరకు, ఓమ్హర్మన్ నగరంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రాథమిక వివరాల Read more

Sunita Williams : సురక్షితంగా భూమికి చేరిన సునీతా విలియమ్స్
Sunita Williams safely return to Earth

Sunita Williams : సునీతా విలియమ్స్ సురక్షితంగా భూమిపై అడుగుపెట్టారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్‌ఎస్‌)లో 9 నెలలుగా చిక్కుకుపోయిన భారత సంతతి వ్యోమగామి సునీతా విలియమ్స్, Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *