USA: భారత్ కు చెందిన నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్ (రా) పై అమెరికా ఆంక్షలు విధించింది. ఇటీవల ది యూఎస్ కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలిజియస్ ఫ్రీడమ్ సంస్థ ‘రా’పై ఆంక్షలు విధించాలని అక్కడి ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. సిక్కు వేర్పాటువాదుల హత్యకు కుట్ర పన్నినట్లు ఆరోపణలు రావడమే దీనికి కారణమని తెలుస్తుంది. ఈ కమిషన్ వార్షిక నివేదికను మంగళవారం విడుదల చేసింది. దీనిలో భారత్‌పై మరిన్ని ఆరోపణలు చేసింది. మైనార్టీలు దారుణ పరిస్థితులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. మత స్వేచ్ఛ విషయంలో ఆందోళనకర దేశంగా భారత్‌ను ప్రకటించాలని సూచించింది. 2024లో కూడా భారత్‌లో మతపరమైన మైనార్ట్లీలపై వేధింపులు, దాడులు పెరుగుతున్నాయని అభిప్రాయపడింది.

మత వ్యవహారాలను ఆ దేశం నియంత్రిస్తోంది
భారత్ ఈ నివేదికపై తక్షణమే స్పందించలేదు. అయితే.. ఈ సంస్థ ఇచ్చిన నివేదికను, సూచనలను ట్రంప్ కార్యవర్గం తప్పనిసరిగా పాటించాలన్న నిబంధన లేదు. వియత్నాంలోని కమ్యూనిస్ట్ పాలకులను కూడా ఈ కమిషన్ నివేదిక లక్ష్యంగా చేసుకొంది. మత వ్యవహారాలను ఆ దేశం నియంత్రిస్తోందని పేర్కొంది. ఆ దేశాన్ని ఆందోళనకర జాబితాలో చేర్చాలని పేర్కొంది. చైనాను కట్టడి చేసే క్రమంలో అమెరికా పాలకులు భారత్, వియత్నాంతో కలిసి పనిచేస్తున్న సంగతి తెలిసిందే. బీజింగ్‌ను కట్టడి చేయడానికి న్యూఢిల్లీ బలమైన శక్తి అని అమెరికా కొన్నేళ్లుగా భావిస్తోంది. ఈనేపథ్యంలో ట్రంప్ కార్యవర్గం భారత నిఘా సంస్థ ‘రా’పై ఎటువంటి చర్యలు చేపట్టకపోవచ్చని నిపుణులు భావిస్తున్నారు. 2023లో అమెరికా, కెనడాలో సిక్కు వేర్పాటువాదులను భారత్ లక్ష్యంగా చేసుకొంటోందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈక్రమంలో మాజీ ఇంటెలిజెన్స్ అధికారి వికాస్ యాదవ్‌పై అమెరికా ఆరోపణలు మోపింది. ఖలిస్థానీ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర పన్నినట్లు దానిలో పేర్కొంది. మరోవైపు అమెరికాలో ఉంటూనే పన్నూ భారత ప్రభుత్వానికి బెదిరింపు సందేశాలను విడుదల చేస్తుండటం విశేషం.