Koil Alwar Thirumanjanam in Tirumala according to scriptures

TTD : తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం

TTD : తిరుమల శ్రీవారి ఆలయంలో తెలుగు నూతన సంవత్సర ఉగాదిని పురస్కరించుకొని కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించారు. కోయిల్ ఆళ్వార్ తిరుమంజనంను శాస్త్రోక్తంగా నిర్వహించామని టీటీడీ ఈవో శ్యామలరావు తెలిపారు. సంవత్సరంలో నాలుగు సార్లు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తామని అన్నారు. శ్రీవారి ఆలయంలో ఉత్సవాలకు ముందు మంగళవారం తిరుమంజనం చేయడం ఆనవాయితీగా వస్తోందని తెలిపారు.

తిరుమలలో శాస్త్రోక్తంగా కోయిల్ ఆళ్వార్

మూలమూర్తికి ప్రత్యేక పూజలు

ఉగాది, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి, ఆణివార ఆస్థానం తిరుమంజనం కార్యక్రమం నిర్వహిస్తామని, ఆలయ ప్రాంగణం, ఆలయ గోడలు, ఆలయ పైకప్పు, దేవత మూర్తులు, పూజ సామాగ్రిని శుద్ధి చేశామని వివరించారు. మూలమూర్తిపై వస్త్రం కప్పి సుగంధ ద్రవ్యాలతో ఆలయ మొత్తం సంప్రోక్షణ చేశామని కార్యక్రమం అనంతరం మూలమూర్తికి ప్రత్యేక పూజలు, నివేదనలు అర్చకులు సమర్పిస్తారని ఈవో తెలిపారు.

image

వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు

కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం కారణంగా మంగళవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, అష్టదళ పాదపద్మారాధన సేవను టీటీడీ అధకారులు రద్దు చేశారు. 25వ తేదీన ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలు, సిఫార్సు లేఖలు స్వీకరించబడవని అధికారులు తెలియజేశారు. 30న ఉగాది ఆస్థానం ఉంటుందని పేర్కొన్నారు.

Related Posts
రామ్ గోపాల్ వర్మకు ఏపీ సర్కార్ నోటీసులు
RGV

సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. వైసీపీ హయాంలో 'వ్యూహం' సినిమాకు అక్రమంగా ప్రభుత్వం నుంచి నిధులు పొందారన్న వ్యవహారంపై Read more

అన్నదాత పథకం క్రింద రైతుకు 20 వేలు : అచ్చెన్నాయుడు
20 thousand to farmers under Annadata scheme.. Atchannaidu

అమరావతి: మ్యానిఫెస్టోలో పెట్టిన ప్రకారం, ఎన్నికల ప్రచారంలో చెప్పిన ప్రకారం, అన్నదాత సుఖీభవ పథకం క్రింద, అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తాం Read more

Govt Job: ప్రభుత్వ ఉద్యోగి వరుడి కోసం రోడ్డెక్కిన యువతీ..వీడియో వైరల్
Govt Job: ప్రభుత్వ ఉద్యోగి వరుడి కోసం రోడ్డెక్కిన యువతీ.. వైరల్ వీడియో!

ప్రస్తుత కాలంలో ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న క్రేజ్ అమితంగా పెరిగిపోతోంది. ఉద్యోగం లభించాలంటే పోటీ తారాస్థాయికి చేరిన ఈ రోజుల్లో, ప్రభుత్వ ఉద్యోగం అంటే ఒక రకమైన Read more

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డా లేక నేనా : కిషన్ రెడ్డి
Telangana CM Revanth Reddy or me.. Kishan Reddy

కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి ఎన్నికల హామీలు ఇచ్చారా? హైదరాబాద్‌: రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై స్పందించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. తెలంగాణ సీఎం రేవంత్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *