'Chhaava' special screening in Parliament!

Chhaava: పార్లమెంట్​లో ‘ఛావా’ స్పెషల్ స్క్రీనింగ్ !

Chhaava: బాలీవుడ్‌ లేటెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ చిత్రం ‘ఛావా’ ను ప్రధాని నరేంద్ర మోడీ వీక్షించబోతున్నారు. ఆయనతో పాటు పలువురు మంత్రులు, ఎంపీల కోసం పార్లమెంట్‌లోనే ప్రత్యేకంగా ఈ చిత్రాన్ని ప్రదర్శించబోతున్నారు. మార్చి 27న పార్లమెంట్‌లోని బాలయోగి ఆడిటోరియంలో ఛావా సినిమాను ప్రదర్శించనున్నారు. ఈ స్క్రీనింగ్‌కి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో పాటు బీజేపీ ఎంపీలు, ఇత‌ర ముఖ్య నాయ‌కులు హాజ‌రుకాబోతున్న‌ట్లు స‌మాచారం. చిత్ర దర్శకుడితో పాటు తారాగణం కూడా హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

పార్లమెంట్​లో  ఛావా స్పెషల్ స్క్రీనింగ్

కేవ‌లం హిందీలోనే రూ.750 కోట్లు

బాలీవుడ్ న‌టుడు విక్కీ కౌశల్ నటించిన చిత్రమే ‘ఛావా. ఛత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు శంభాజీ మహారాజ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కింది. ల‌క్ష్మ‌ణ్ ఉటేక‌ర్ ద‌ర్శ‌కత్వం వ‌హించ‌గా.. దినేష్ విజన్ నిర్మించారు. ర‌ష్మిక మంద‌న్నా, అక్షయ్‌ ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రం 2025 ఫిబ్రవరి 14న విడుదలై సూప‌ర్ హిట్ అందుకోవ‌డ‌మే కాకుండా.. కేవ‌లం హిందీలోనే రూ.750 కోట్ల‌కు పైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

గతంలోనే ఛావా సక్సెస్‌పై ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు

రీసెంట్‌గా ఈ సినిమాను తెలుగులో కూడా విడుద‌ల చేయ‌గా.. భారీ వ‌సుళ్ల‌ను సాధించింది. ఛావా సక్సెస్‌పై గతంలోనే ప్రధాని మోడీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగిన 98వ అఖిల భారతీయ మరాఠీ సాహిత్య సమ్మేళనానికి హాజరై ఆయన.. ప్రస్తుతం దేశంలో ఛావా హవా కొనసాగుతోందంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలోనే ఛావా చిత్రానికి స్ఫూర్తినిచ్చిన నవల(ఛావా) రచయిత శివాజీ సావంత్‌కు ఈ ఘనతంతా దక్కుతుందని అభినందించారు.

Related Posts
వీఐ “సూపర్‌హీరో” పథకం
VI launched the “Superhero” scheme

పరిశ్రమలో మొదటిసారిగా “సూపర్‌హీరో” పథకాన్ని ప్రముఖ టెలికాం ఆపరేటర్ Vi తీసుకువచ్చింది. ఇది 12 AM నుండి 12 PM మధ్య అపరిమిత డేటాను వినియోగించుకునే అవకాశం Read more

దొంగల్ని పట్టించిన గుజరాత్ పోలీస్ కుక్క
Beagle 1024x669 1

గుజరాత్‌లోని అహ్మదాబాద్ జిల్లా లో ఒక రైతు ఇంటి నుండి ₹1.07 కోట్ల విలువైన నగదు మరియు బంగారం దొంగిలించబడిన ఘటన చాలా చర్చనీయాంశమైంది. ఈ దోపిడీకి Read more

Central Minister:హైకోర్టు న్యాయమూర్తి పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మహిళా మంత్రి
Central Minister:హైకోర్టు న్యాయమూర్తి పై ఆగ్రహం వ్యక్తం చేసిన కేంద్ర మహిళా మంత్రి

2021 నవంబర్‌లో జరిగిన లైంగిక వేధింపుల కేసు విచారణ సందర్భంగా అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామ్ మనోహర్ నారాయణ మిశ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదంగా Read more

నిలిచిన SBI సేవలు
మహిళలకు తక్కువ వడ్డీ రేటుకే నిధులు: ఎస్బిఐ

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) సేవలు నిన్న సాయంత్రం నాలుగు గంటల పాటు నిలిచిపోయాయి. ముఖ్యంగా యూపీఐ (UPI) Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *