Sajjanar appeals to betting app victims

Sajjanar: బెట్టింగ్ యాప్ బాధితులకు సజ్జనార్ విజ్ఞప్తి

Sajjanar: ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. పలువురు సినీ, క్రికెట్ సెలెబ్రెటీస్, యూట్యూబ్ స్టార్స్ చేసిన బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ నమ్మి అమాయక ప్రజలు, యువకులు లక్షలాది రూపాయలు బెట్టింగ్స్ లో పెట్టి మోసపోయిన ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా మంగళవారం మేడ్చల్ జిల్లా గౌడవెల్లికి చెందిన సోమేష్ అనే యువకుడు క్రికెట్ బెట్టింగ్ లో రూ.2 లక్షలు పోగొట్టుకొని, ఇంట్లో వాళ్ళకు మొహం చూపించలేక రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు.

బెట్టింగ్ యాప్ బాధితులకు సజ్జనార్

స‌మ‌స్య ఏదైనా స‌రే.. ఆత్మహత్య పరిష్కారం కాదు

ఈ వ్యవహారంపై తీవ్ర ఆవేదన చెందిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ బెట్టింగ్ యాప్ బాధితులకు కీలక విజ్ఞప్తి చేశారు. స‌మ‌స్య ఏదైనా స‌రే.. ఆత్మహత్య అనేది పరిష్కారం కాదన్నారు. ఆన్ లైన్ బెట్టింగ్ భూతానికి వ్యసనపరులే బలవన్మరణాలను పాల్పడకండని యువకులకు వినతి చేశారు. క్షణికావేషంలో తీసుకునే నిర్ణయాల వల్ల మీ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఎంతటి క్షోభను అనుభవిస్తారో ఒక్కసారి ఆలోచించమని అన్నారు. సమస్య వచ్చినప్పుడు దాని నుంచి ఎలా బయటపడాలో అన్వేషించాలే తప్పా.. చనిపోవాలనే ఆలోచనే రాకూడదని సూచించారు. ఉన్నది ఒక్కటే జీవితం అని, ఏం సాధించిన అందులోనే అని తెలిపారు.

బలవన్మరణం వద్దు.. బ‌తికి సాధించ‌డ‌మే ముద్దు

జీవ‌న ప్రయాణంలో ఒక్కసారి కిందపడితే.. సర్వం కోల్పోయినట్లు కాదని, ఆముల్యమైనా జీవితాన్ని అర్దాంతరంగా కాలదన్నుకోవద్దని సలహా ఇచ్చారు. చీకటి వెలుగులా నిత్యం కష్టసుఖాలు అందర్నీ వెంటాడుతూనే ఉంటాయని, కష్టకాలంలో బాధలను ఇతరులతో పంచుకోవాలని, పరిష్కార మార్గాలు వెతకాలన్నారు. ఎంత కష్టం వచ్చినా ఎల్లకాలం ఉంటుందా?, చనిపోయినంతా మాత్రాన సమస్యలు టక్కున మాయమవుతాయా!? అనే ప్రశ్న వేసుకోవాలని, బలవన్మరణం వద్దు.. బ‌తికి సాధించ‌డ‌మే ముద్దు అని యువతకు హితబోధ చేశారు.

Related Posts
పెళ్లి చేసుకున్న టాలీవుడ్ హీరో
srisimha wedding

టాలీవుడ్ యువ హీరో ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి చిన్న కుమారుడు శ్రీసింహ వివాహబంధంలో అడుగుపెట్టారు. సీనియర్ నటుడు మురళీమోహన్ మనవరాలు రాగా‌తో శ్రీసింహ వివాహం ఘనంగా Read more

రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందన
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కిషన్ రెడ్డి స్పందన

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కులంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పందించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి రేవంత్ రెడ్డి Read more

గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కొరకు డీమ్డ్ యూనివర్శిటీ అప్లికేషన్స్
Deemed University inviting applications for undergraduate programmes

న్యూఢిల్లీ : దేశంలో అతిపెద్ద ప్రైవేట్ యూనివర్శిటీగా పేరుతెచ్చుకున్న సింబయాసిస్ ఇంటర్నేషనల్ ఇప్పుడు అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్స్ కొరకు అప్లికేషన్స్ ను ఆహ్వానిస్తోంది. సింబయాసిస్ ఇంటర్నేషనల్ (డీమ్డ్ Read more

రన్యారావ్ ఇళ్లలో ED దాడులు..పెద్ద ఎత్తున బంగారం సీజ్
రన్యారావు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి

కర్ణాటక గోల్డ్ స్మగ్లింగ్ కేసు నేపథ్యంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) దాడులు ముమ్మరం చేసింది. బెంగళూరులోని ఎనిమిది ప్రదేశాల్లో ఒకేసారి ఈ దాడులు నిర్వహించాయి. ఇందులో కోరమండలం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *