Movie: 250 కోట్లు పెట్టిన ఫ్లాప్ అయిన సినిమా

Movie: 250 కోట్లు పెట్టిన ఫ్లాప్ అయిన సినిమా

ఇటీవల కాలంలో భారీ బడ్జెట్‌తో నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచిన ఘటనలు ఎక్కువయ్యాయి. గతంలో ఇండియన్ సినిమాలు కేవలం దేశీయ ప్రేక్షకులకు పరిమితమయ్యే పరిస్థితి ఉండగా, ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో విజయాలను సాధిస్తున్నాయి. అయితే, కంటెంట్ లేకుండా భారీ బడ్జెట్‌ సినిమాలు నిర్మిస్తే ఆర్థికంగా నష్టాలను మూటగట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

Theatre TOI e27862

భారతీయుడు 2 – భారీ అంచనాలకు తక్కువ వసూళ్లు!

శంకర్ దర్శకత్వం వహించిన కమల్ హాసన్ నటించిన భారతీయుడు 2 భారీ బడ్జెట్‌తో తెరకెక్కినప్పటికీ, బాక్సాఫీస్‌ వద్ద అంచనాలకు తగ్గట్టుగా సక్సెస్ సాధించలేకపోయింది. కోలీవుడ్ స్టార్ సూర్య నటించిన ‘కంగువా’ సినిమా కూడా బాక్సాఫీస్‌ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయింది. బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్ నటించిన ‘బడే మియా చోటే మియా’ కూడా భారీ నష్టాలను మిగిల్చిన మరో సినిమా. అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలో నటించిన ‘మైదాన్’, భారత జాతీయ ఫుట్‌బాల్‌ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ జీవితం ఆధారంగా రూపొందించబడింది. ఏ.ఆర్. రెహమాన్ సంగీతం, అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా మిగిలిపోయింది. రూ 250 కోట్లు ఖర్చు పెడితే బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా వసూలు చేసింది మాత్రం రూ.68 కోట్లు మాత్రమే. అది కూడా నెట్ కలెక్షన్లు. అంటే ఈ సినిమాకు రూ.50 కోట్లు కూడా షేర్ రాలేదు. ఈ లెక్కన పెట్టిన పెట్టుబడిలో కనీసం 30 శాతం డబ్బులు కూడా తిరిగి రాలేదు.అయితే ఓటీటీలో మాత్రం ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించింది. బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు సాధించలేకపోయినప్పటికీ, ఓటీటీలో ఈ సినిమా ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.

Related Posts
మల్లయుద్ధ యోధునిగా
Ram Charan 3 1703845874699 1703845884869

ప్రసిద్ధ నటుడు రామ్‌చరణ్‌ నటించిన 'గేమ్‌చేంజర్‌' సినిమా సంక్రాంతి పండుగ సందర్బంగా విడుదల అవ్వనుంది. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌రాజు ప్రమోషన్ల ప్రక్రియను ప్రారంభించారు. రామ్‌చరణ్‌ Read more

Mahesh Babu: మహేష్ బాబు సినిమాపై పృథ్వీరాజ్ వివరణ
Mahesh Babu: మహేష్ బాబు సినిమాపై పృథ్వీరాజ్ క్లారిటీ

సూపర్ స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం టాలీవుడ్‌ కాదు, దేశవ్యాప్తంగా సినీప్రియుల్లో భారీ అంచనాలను ఏర్పరచుకుంది. ఇప్పటివరకు రాజమౌళి దర్శకత్వంలో Read more

చిన్న చిత్రమైన ధూం ధాం వినోదమే విజయ మంత్రం
Dhoom c87279a2a9 v jpg

ధూం ధాం సినిమా ప్రేక్షకులను అలరిస్తూ విజయవంతంగా థియేటర్లలో నడుస్తోంది. చేతన్‌కృష్ణ హీరోగా నటించిన ఈ సినిమా శుక్రవారం విడుదలై అన్ని కేంద్రాల్లో మంచి స్పందనను సొంతం Read more

Rahul Sipligunj: నేను చేసిన ఆ తప్పుకి ఇప్పటికీ బాధపడుతుంటా: రాహుల్ సిప్లిగంజ్
singer rahul sipligunj

'ఆర్ఆర్ఆర్' సినిమా లోని 'నాటు నాటు' పాటతో ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకట్టుకున్న రాహుల్ సిప్లిగంజ్ తన ప్రతిభతో విశేష అభిమానం సంపాదించారు బిగ్ బాస్ ఫేమ్‌గా తనకు Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *