Telangana: తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ఏఐసీసీ గ్రీన్ సిగ్నల్ఇచ్చింది. ఏప్రిల్ 3న కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం ఉండే అవకాశం ఉంది. ఇద్దరు బీసీలు, రెడ్డి, ఎస్సీకి మంత్రివర్గంలో చోటు దక్కనున్నట్లు సమాచారం. ఈ మేరకు రాష్ట్ర కోర్ కమిటీ నుంచి ఏఐసీసీ వివరాలు తీసుకుంది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ నుంచి అభిప్రాయాలు సేకరించింది.

మొత్తం ఆరు ఖాళీల్లో నాలుగైదు స్థానాలు భర్తీ
సుదర్శన్‌రెడ్డి, రాజగోపాల్‌రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డిలో ఒకరికి చోటు దక్కే అవకాశం ఉంది. బీసీలో శ్రీహరి ముదిరాజ్, ఆది శ్రీనివాస్‌కు.. ఎస్సీలో చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి చోటు దక్కే అవకాశం ఉంది. మొత్తం ఆరు ఖాళీల్లో నాలుగైదు స్థానాలు భర్తీ చేసే అవకాశం ఉంది. మైనారిటీలకు అవకాశమిస్తే ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది. మొత్తం ఆరు ఖాళీల్లో నాలుగింటిని భర్తీ చేసే అవకాశం ఉంది. ఒకవేళ మరో స్థానం భర్తీ చేయాలనుకుంటే మైనారిటీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీ అమీర్ అలీఖాన్‌కు చోటు దక్కే అవకాశం ఉంది.
ఇక త్వరలోనే తెలంగాణ పీసీసీ కార్యవర్గ ప్రకటన
మంత్రివర్గంలో ఎస్టీకి అవకాశం కల్పించాలనే పక్షంలో, ఆ వర్గం ఎమ్మెల్యేను డిప్యూటీ స్పీకర్‌గా చేయనున్నారు. ఇక త్వరలోనే తెలంగాణ పీసీసీ కార్యవర్గ ప్రకటన కూడా వెలువడనుంది. తొలి విడతలో నలుగురు కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌లు, 20 మందికిపైగా వైస్ ప్రెసిడెంట్‌లను ప్రకటించనున్నారు. కొన్ని నామినేటెడ్ పోస్టులను కూడా భర్తీ చేస్తారు.