opposition does not even have the slightest responsibility .. Minister Ponnam Prabhakar

Ponnam Prabhakar: ప్రతిపక్షానికి కనీస బాధ్యత కూడా లేదు : మంత్రి పొన్నం

Ponnam Prabhakar: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీపైనా తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రతిపక్షం బాధ్యత లేకుండా ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. ప్రస్తుతం సభలో 56 శాతం బలహీన వర్గాలకు సంబంధించిన అంశంపై మాట్లాడే సందర్భంగా ప్రతిపక్షం తరఫున సభలో నలుగురు కూడా లేరు. ఈ క్రమంలోనే మంత్రి మాట్లాడుతూ.. ప్రతిపక్షానికి బాధ్యత లేదు.. బలహీన వర్గాల పట్ల శ్రద్ధ లేదని అన్నారు. బలహీన వర్గాలకు న్యాయం జరగాలని ఎన్నికల సమయంలో చెప్పిన విధంగా అన్నీ కార్యక్రమాలు చేపడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు.

ప్రతిపక్షానికి కనీస బాధ్యత కూడా

పార్టీ అధ్యక్ష పదవి బలహీన వర్గాలకు ఇవ్వండి

ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడు, కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత అన్నీ వారి సామాజిక వర్గమే. పార్టీ అధ్యక్ష పదవి బలహీన వర్గాలకు ఇవ్వండి. మేం ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్ష పదవి ఒక్కో వర్గానికి ఇచ్చి సామాజిక న్యాయం పాటించాం. మేం చేసిన కులగణన వల్ల 5 ఎమ్మెల్సీ స్థానాలను కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇవ్వాల్సి వచ్చింది. మీరు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఎమ్మెల్సీ బీసీకి ఇవ్వాల్సి వచ్చింది. 42 శాతం రిజర్వేషన్ల చట్టాన్ని కేంద్రంలో అమలు చేసి తీసుకొచ్చే బాధ్యత బీజేపీ సభ్యులపై ఉంది. మహేశ్వర్‌రెడ్డి దిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకుపోవాలి అని పొన్నం సూచించారు. అనంతరం బీసీ సంక్షేమ శాఖ పద్దులను శాసనసభ ఆమోదించింది.

Related Posts
మంచిర్యాలలో గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్..
food poisoning telangana go

తెలంగాణ రాష్ట్రంలోని గురుకులాల పరిస్థితి, ముఖ్యంగా గిరిజన ఆశ్రమ పాఠశాలలలో ఎదురైన ఆరోగ్య సమస్యలు, తీవ్ర ఆందోళన కలిగించే అంశంగా మారాయి. పలువురు విద్యార్థులు ఫుడ్ పాయిజనింగ్ Read more

విడుదల పార్ట్ 2 OTT తేదీ: ఎప్పుడు ఎక్కడ చూడొచ్చు?
విడుదల పార్ట్ 2 OTT తేదీ: ఎప్పుడు ఎక్కడ చూడొచ్చు?

విజయ్ సేతుపతి క్రైమ్ థ్రిల్లర్ విడుదల పార్ట్ 2, డిసెంబర్ 20 న విడుదలైంది మరియు ఇప్పుడు దాని డిజిటల్ విడుదలకు సిద్ధంగా ఉంది. తీవ్ర కథాంశం Read more

నేటి నుంచి ఏపీలో ఇంటర్ సెకండియర్ ఎగ్జామ్స్
exams

ఆంధ్రప్రదేశ్‌లో ఇవాళ్టి నుంచి ఇంటర్మీడియట్ రెండో సంవత్సరం పరీక్షలు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన ఈ పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం Read more

వీరరాఘవ రెడ్డికి మూడ్రోజుల పోలీసు కస్టడీ
veeraraghava custady

రాజేంద్రనగర్ కోర్టులో పోలీసులు కస్టడీ చిలుకూరు బాలాజీ ఆలయం ప్రధాన అర్చకుడు రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న వీరరాఘవ రెడ్డిని మూడ్రోజుల పాటు పోలీస్ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *