हिन्दी | Epaper
పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం పట్టాలు తప్పిన రైలు పట్టాలు తప్పిన చెన్నై ఎక్స్ ప్రెస్ రైలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు రికార్డు స్థాయికి చేరిన భారత్-చైనా ట్రేడ్ క్రీడా సంఘాల పాలనపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు ఉచిత పథకాలపై ఆర్థిక సర్వే హెచ్చరిక ముగిసిన అజిత్ పవార్ అంత్యక్రియలు ప్రపంచ దేశాలకు భారత్ షాక్ నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్ దుర్మరణం

BJP : డీకే పై బిజెపి ఆగ్రహం

Sudheer
BJP : డీకే పై బిజెపి ఆగ్రహం

కర్ణాటక డిప్యూటీ సీఎం DK శివకుమార్ చేసిన రాజ్యాంగ మార్పు వ్యాఖ్యలు తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ రాజ్యాంగాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉందని ఆయన అంగీకరించారని బీజేపీ ఆరోపిస్తోంది. ఈ వ్యాఖ్యలు భారత రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకమని ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకమా?

కాంగ్రెస్ ఈ విధంగా రాజ్యాంగ మార్పుపై మాట్లాడడం, అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకమని బీజేపీ నాయకులు విమర్శించారు. ‘కాంగ్రెస్ పార్టీ SC, ST, OBCల ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా వ్యవహరిస్తోంది’ అని బీజేపీ జాతీయ ప్రతినిధి షెజాద్ పూనావాలా ధ్వజమెత్తారు. దేశంలోని వెనుకబడిన వర్గాలను కాంగ్రెస్ పట్టించుకోవడం లేదని, వారి హక్కులను కాలరాస్తోందని ఆరోపించారు.

బీజేపీ జాతీయాధ్యక్షుడిపై కసరత్తు

కాంగ్రెస్ ముస్లిం ప్రాధాన్యతపై విమర్శలు

బీజేపీ నేతలు కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ ప్రయోజనాల కన్నా ముస్లిముల బుజ్జగింపుకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోందని అమిత్ మాలవీయ విమర్శించారు. ‘రాజ్యాంగాన్ని రక్షించాలి అని చెప్పే రాహుల్ గాంధీ ఇప్పుడు ఎక్కడ? ఆయన దీనిపై ఎందుకు స్పందించడంలేదు?’ అని ప్రశ్నించారు.

రాజకీయంగా వేడెక్కుతున్న వాదనలు

DK శివకుమార్ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారాయి. బీజేపీ దీన్ని ప్రధాన అస్త్రంగా ఉపయోగించుకొని కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. దీనిపై కాంగ్రెస్ ఎలా స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది. రాబోయే రోజుల్లో ఈ వివాదం మరింత రాజుకుంటుందా, లేదా కాంగ్రెస్ స్పష్టత ఇచ్చి చర్చను ఆపేస్తుందా అనేది వేచిచూడాల్సిన విషయం.

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870