For what reason was I suspended.. Jagadish Reddy

Jagadish Reddy: నన్ను ఏ కారణంతో సస్పెండ్‌ చేశారు: జగదీశ్‌రెడ్డి

Jagadish Reddy: బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి పై ఈనెల 27 వరకు బడ్జెట్‌ సమావేశాలకు హాజరుకాకుండా వేటు పడిన విషయం తెలిసిందే. అయినప్పటికీ సోమవారం ఆయన అసెంబ్లీకి వచ్చారు. దీంతో సభ లోపలికి వెళ్లకుండా జగదీశ్‌ రెడ్డిని చీఫ్‌ మార్షల్ అడ్డుకున్నారు. అనంతరం జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. శాసనసభ సమావేశాలను ఇష్టారీతిన నిర్వహిస్తున్నారని ఆరోపించారు. అసెంబ్లీకి రావొద్దనడానికి ఎలాంటి ఆంక్షలు ఉన్నాయని ప్రశ్నించారు.

నన్ను ఏ కారణంతో సస్పెండ్‌ చేశారు

ప్రభుత్వ అరాచకత్వానికి ఇది పరాకాష్ట

నన్ను ఏ కారణంతో సస్పెండ్‌ చేశారు. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి బులెటిన్‌ విడుదల చేయలేదు. సస్పెండ్‌ చేశారో, లేదో కనీసం ఆధారాలు లేవు. బులెటిన్‌ ఇస్తే నేను రాను. లేదంటే సభాపతిని కలుస్తా. నేను కోర్టుకు వెళ్తానన్న భయంతో బులెటిన్‌ ఇవ్వట్లేదు. ఎలాంటి రాజ్యాంగ విలువలు, నిబంధనలు పాటించకుండా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ అరాచకత్వానికి ఇది పరాకాష్ట. మంత్రులు జవాబివ్వలేక .. ప్రశ్నోత్తరాలు రద్దు చేస్తున్నారు. దావత్‌లకు కూడా మంత్రులు ప్రభుత్వ హెలికాప్టర్లలో వెళ్తున్నారు అని జగదీశ్‌ రెడ్డి దుయ్యబట్టారు.

Related Posts
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం
plane crashed in Kazakhstan

అజర్‌బైజాన్: కజకిస్తాన్‌లో విమాన ప్రమాదం చోటుచేసుకుంది. అజర్‌బైజాన్ ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానం కజకిస్తాన్‌లోని అక్టౌ నగరానికి సమీపంలో కూలిపోయింది. విమానం క్రాష్ కావడంతో మంటలు చెలరేగాయి. ప్రమాదం Read more

మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ : ఏపీ ప్ర‌భుత్వం
Mega DSC Notification in March .. AP Govt

మార్చిలో మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ : అమరావతి: ఏపీ ప్ర‌భుత్వం నిరుద్యోగుల‌కు శుభవార్త చెప్పింది. ఈ మార్చిలో 16,247 టీచ‌ర్‌ పోస్టుల భ‌ర్తీకి మెగా డీఎస్సీ నోటిఫికేష‌న్ Read more

పాలస్తీనియన్లను విడుదల చేయనున్న ఇజ్రాయెల్‌
palestine prisoners

ఇజ్రాయెల్‌-హమాస్‌ మధ్య కాల్పుల విరమణకు సయోధ్య కుదరడంతో బందీల విడుదలకు మార్గం సుగమమైంది. ఆదివారం నుంచి ఈ ప్రక్రియ ప్రారంభం కానుంది. మొదటి విడుతలో భాగంగా తమ Read more

మహిళలకు టీఎస్ మరో శుభవార్త
seethakka

తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నది. ఇందులో భాగంగా మహిళలు ఊరూరా తిరుగుతూ.. చేపల్ని వాహనాల్లో అమ్ముకునేందుకు వీలుగా ప్రభుత్వం సంచార చేపల Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *