Anchor Shyamala appears before the police

Anchor shyamala : పోలీసుల ఎదుట హాజరైన యాంకర్‌ శ్యామల

Anchor shyamala: బెట్టింగ్ యాప్‌ లు ప్ర‌మోట్ చేసిన కేసులో త‌నపై న‌మోదైన కేసును కొట్టివేయాలంటూ యాంకర్ శ్యామల తెలంగాణ హైకోర్టు లో క్వాష్ పిటిష‌న్ వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో న్యాయ‌స్థానం ఆమెను అరెస్టు చేయొద్ద‌ని పోలీసుల‌కు ఆదేశాలు జారీ చేసింది. అలాగే విచార‌ణ‌కు స‌హ‌క‌రించాల్సిందిగా యాంకర్ శ్యామలకు సూచించారు. ఈ క్రమంలో యాంక‌ర్ శ్యామ‌ల ఈరోజు(సోమవారం) పంజాగుట్ట పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు.

పోలీసుల ఎదుట హాజరైన యాంకర్‌

పంజాగుట్ట పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రు

ఈ తరుణంలో యాంకర్ శ్యామలతో పాటు నేడు విచారణకు బయ్యా సన్నీ యాదవ్, అజయ్, సుధీర్ లు కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక హర్ష సాయి, ఇమ్రాన్ ఖాన్‌లు ఇంకా పోలీసులకు అందుబాటులోకి రాలేదని తెలుస్తోంది. వీరి ఇరువురి కోసం గాలిస్తున్నట్లు తెలిపారు. ఈ కేసులో ఇప్ప‌టికే మీడియా ఇన్‌ఫ్లూయెన్స‌ర్ రీతూచౌద‌రి, టీవీ యాంక‌ర్ విష్ణుప్రియ‌లు సైతం పంజాగుట్ట పోలీసుల ఎదుట విచార‌ణ‌కు హాజ‌రైన విష‌యం తెలిసిందే.

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు

ఇక యాంకర్ శ్యామల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. దీంతో ఆమెను సోషల్ మీడియాలో దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఉన్న కారణంగా నటి శ్యామల పైన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేసిన వైసీపీ ప్రతినిధి అంటూ మండిపడుతున్నారు. తెలుగు తమ్ముళ్లు పంజాగుట్ట పిఎస్ కు వైఎస్ఆర్సిపి అధికార ప్రతినిధి శ్యామల అంటూ ఆమెను టార్గెట్ చేస్తున్నారు.

Related Posts
ఓఆర్ఆర్ సరస్సుల ఆక్రమణలపై త్వరలోనే హైడ్రా చర్యలు
ఓఆర్ఆర్ సరస్సుల ఆక్రమణలపై త్వరలోనే హైడ్రా చర్యలు

హైడ్రా కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ, ఔటర్ రింగ్ రోడ్ (ఓఆర్ఆర్) పరిసర ప్రాంతంలోని సరస్సుల పూర్తి ట్యాంక్ స్థాయిని (ఎఫ్టిఎల్) త్వరలో నిర్ణయిస్తామని Read more

Ilaiyaraaja- Modi : మోదీతో ‘మ్యూజిక్ మ్యాస్ట్రో’ భేటీ
Ilaiyaraaja Modi

ప్రముఖ సంగీత దర్శకుడు, మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశం గురించి ఇళయరాజా తన ట్విట్టర్ ఖాతాలో Read more

ఏపీలో పింఛన్లకు సంబంధించి కీలక నిర్ణయం
Important decision regarding pensions in AP

ఉద‌యం 4, 5 గంట‌ల నుంచి కాకుండా 7 గంట‌ల నుంచి ఫించ‌న్ల పంపిణీ అమరావతి: ఏపీలో పింఛన్ల పంపిణీకి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రతి Read more

అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ఆటోను ఢీకొట్టిన లారీ, ఏడుగురు దుర్మరణం

అనంతపురం జిల్లా కూడేరు మండలం కమ్మూరు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తల్లీకూతురు సహా నలుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *