Computers for primary schools.. Government decision!

Primary Schools : ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు: ప్రభుత్వం నిర్ణయం!

Primary Schools : తెలంగాణ వ్యాప్తంగా 50 మందికి పైగా విద్యార్థులున్న ప్రతి ప్రాథమిక పాఠశాలకు 5 చొప్పున కంప్యూటర్లు సరఫరా చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వాటిని వచ్చే జూన్‌ 1 నాటికి పాఠశాలల్లో ఏర్పాటు చేయాలని విద్యాశాఖ ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో ఈ నెల 15 నుంచి ప్రయోగాత్మకంగా 513 ప్రాథమిక పాఠశాలల్లో ఏక్‌ స్టెప్‌ సంస్థ సహకారంతో కృత్రిమ మేధ (ఏఐ) టూల్స్‌ను వినియోగిస్తూ ఆంగ్లం, గణితం పాఠాలను విద్యార్థులకు బోధిస్తున్నారు. పిల్లల్లో అభ్యసన సామర్థ్యాలను పెంచే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని విద్యాశాఖ చేపట్టింది. దీన్ని వచ్చే విద్యా సంవత్సరం (2025-26) రాష్ట్రంలోని మరిన్ని పాఠశాలల్లో అమలు చేయాలని నిర్ణయించారు. అందుకు కంప్యూటర్లు అవసరమైనందున వాటిని అందజేయనున్నారు. అంతేకాకుండా 1 నుంచి 5వ తరగతి వరకు గణితం సబ్జెక్టులో ఏఐ పాఠ్యాంశాన్ని కూడా చేరుస్తున్నారు.

ప్రైమరీ స్కూళ్లకు కంప్యూటర్లు ప్రభుత్వం

ప్రతి ల్యాబ్‌కు 100 కంప్యూటర్లను సరఫరా

రాష్ట్రంలో 18,254 ప్రాథమిక పాఠశాలలుండగా.. వాటిలో 1,900 చోట్ల ఒక్క విద్యార్థి కూడా లేరు. 50 మంది దాటిన పాఠశాలలు సుమారు 3,500 వరకు ఉన్నాయి. డైట్‌ కళాశాలలను బలోపేతానికై ప్రభుత్వం ప్రతి దాంట్లో పూర్తిస్థాయిలో కంప్యూటర్‌ ల్యాబ్‌లను ఏర్పాటు చేయనుంది. ప్రతి ల్యాబ్‌కు 100 కంప్యూటర్లను సరఫరా చేయనున్నారు. డిజిటల్‌ తరగతి గదుల కోసం ప్రతి కళాశాలకు ఆరు ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానెళ్లను అందజేస్తారు. వాటిని గ్రీన్‌బోర్డులుగాను, టీవీలుగాను వాడుకోవచ్చు. ప్రతి జిల్లాలో వేసవి సెలవుల్లో సమ్మర్‌ క్యాంపులను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అందులో భాగంగా ఎటువంటి కార్యక్రమాలను అందించాలో నిర్ణయించేందుకు ఆయా డీఈవోలు కలెక్టర్లతో సంప్రదించి ఏప్రిల్‌ 4వ తేదీ నాటికి నివేదిక అందజేయాలి. ఆ తర్వాత ఏప్రిల్‌ 7, 8 తేదీల్లో మేదోమథనం జరిపి కార్యక్రమాలను ఖరారు చేస్తామని విద్యాశాఖ పేర్కొంది.

Related Posts
విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మృతి.. అమెరికా వెల్లడి..!
A total of 67 people died in the plane crash.. America revealed.

వాషింగ్టన్‌: అమెరికా చరిత్రలోనే అత్యంత ఘోరమైన వైమానిక ప్రమాదాల్లో ఒకటిగా నిలిచిన వాషింగ్టన్ విమాన ప్రమాదంలో మొత్తం 67 మంది మరణించినట్టు అమెరికా ప్రకటించింది. వాషింగ్టన్ లోని Read more

అదానీ గొప్ప మనసు.. దివ్యాంగుల వివాహానికి రూ.10 లక్షలు
jeet adani

ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ అదానీ తనయుడు జీత్ అదానీ – దివా వివాహ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ శుభకార్యంలో "మంగళ సేవ" అనే ప్రత్యేక Read more

15 నుంచి ఒంటిపూట బడులు.. ప్రభుత్వం ఉత్తర్వులు
Half day schools schools from March 15th government orders

హైదరాబాద్‌: తెలంగాణలో ఎండలు దంచికొడుతున్నాయి. రాబోయే రోజుల్లో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నది. ఈ క్రమంలో ప్రభుత్వం పాఠశాలల సమయంపై కీలక నిర్ణయం తీసుకున్నది. ఈ Read more

AI విశ్వవిద్యాలయం ఏర్పాటుకు టాస్క్‌ఫోర్స్‌: మహారాష్ట్ర
ashish shelar

దేశంలోని మొట్టమొదటి AI విశ్వవిద్యాలయం ప్రణాళిక అమలు కోసం మహారాష్ట్ర ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేసింది. ఈ విశ్వవిద్యాలయం AI సంబంధిత రంగాలలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహిస్తుందని Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *